Hair Growth Tips: జుట్టు మాడు నుండి పెరుగుతుంది. అంతేకాని కత్తిరించిన భాగం నుండి పెరగదు.అందువల్ల కత్తిరించటం వలన ఎటువంటి ఉపయోగం ఉండదు.
జుట్టుకు తరచూ రంగు వేసుకోవటం, ఘాడత ఎక్కువ ఉన్న షాంపులను వాడటం, తరచూ తలకు కొబ్బరి నూనె పెట్టి తల స్నానం చేయటం వంటి కారణాల వలన జుట్టు పెరుగుదల ఆగుతుంది.
తలకు కొబ్బరి నూనె రాసుకోవటం వలన తలలో జిడ్డు,మట్టి చేరుతుంది. పోషకాహార లోపం, హిమోగ్లోబిన్ తగినంతగా లేకపోవటం, అండాశయంలో సిస్టులు, పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోం, ధైరాయిడ్ వంటి సమస్యల వలన జుట్టు ఊడిపోతుంది.
జుట్టు ఊడిపోవటానికి కారణాలను ముందుగా తెలుసుకోవాలి. అంతేకాని జుట్టు కత్తిరిస్తే బాగా పెరుగుతుందని అనుకోకూడదు. మీరు సమస్యను తెలుసుకొని చికిత్స తీసుకుంటే తప్పకుండా మీ జుట్టు బాగా పెరుగుతుంది. అలాగే పోషకాహారం తీసుకోవాలి. అంతేకాక ఒత్తిడిని తగ్గించుకోవాలి.