Banana Kebab:అరటికాయతో రుచికరమైన కబాబ్స్ ని ఇలా చేసుకోండి. కొంత మంది అరటికాయను తినటానికి ఇష్టపడరు. అలాంటి వారికీ ఇది బెస్ట్ ఎంపిక అని చెప్పవచ్చు. పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తింటారు.
కావలసిన పదార్దాలు
అరటికాయలు-మూడు,
ఉల్లిపాయ-ఒకటి
పచ్చిమిర్చి-మూడు,
అల్లం-చిన్నముక్క
ఉప్పు, కారం-తగినంత,
పసుపు-చిటికెడు,
జీలకర్ర, ధనియాలపొడి-అరచెంచా
గరంమసాలా-చెంచా
మొక్కజొన్న పిండి-రెండు చెంచాలు
నిమ్మరసం -చెంచా,
కొత్తిమీర-కొద్దిగా
నూనె-కొద్దిగా
తయారుచేసే విధానం :
అరటికాయలను బాగా ఉడికించి, పై తొక్క తీసి మెత్తగా చేయాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చిని సన్నని ముక్కలుగా కోసుకోవాలి. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి దానిలో కొంచెం నూనె పోసి వేడెక్కాక, దానిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అరటి ముద్ద, అల్లం ముక్కలు, ఉప్పు,పసుపు, జీలకర్ర,గరం మసాలా, మొక్కజొన్న పిండి, కొత్తిమీర వేసి బాగా కలిపి, చివరన నిమ్మరసం కలిపి పొయ్యి కట్టేయాలి. ఈ మిశ్రమం చల్లారాక నచ్చిన షేప్ లో చేసుకొని నూనెలో గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించుకొంటే అరటి కబాబ్ రెడీ.