Babycorn Fingers:బేబీ కార్న్‌తో టేస్టీ ఫింగర్స్.. సీజన్ లో దొరికే మొక్క జొన్నలతో పిల్లలకి ఎన్నో స్నాక్ ఐటెమ్స్ చేసి పెడుతుంటాం. అలాగే బేబి కార్న్ తో పకోడి చేసి చూడండి.
కావాల్సిన పదార్ధాలు
శనగ పిండి – 1 కప్పు
బియ్యం పిండి – 3 టేబుల్ స్పూన్స్
జీలకర్ర పొడి – ½ టీ స్పూన్
కారం -1 స్పూన్
ఉప్పు – ¾ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ½ స్పూన్
అజోవాన్ – కొద్దిగా
సోడా – కొద్దిగా
బేబి కార్న్ – 200 గ్రాములు
తయారీ విధానం
1.ముందుగా మిక్సింగ్ బౌల్ లోకి శనగ పిండిని ,బియ్యం పిండి,కారం,ఉప్పు,జీలకర్ర పొడి,అల్లం వెల్లుల్లి పేస్ట్,బరకగా గ్రైండ్ చేసుకున్న వాము ,చిటికెడు సోడా వేసి పిండిని మిక్స్ చేసుకోవాలి.
2.కొద్ది కొద్దిగా నీళ్లను కలుపుతూ పిండిని మెత్తగా కొద్దిగా జారుగా కలుపుకోవాలి.
3.ఇప్పుడు బేబి కార్న్ తీసుకోని పొడవాటి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
4.కార్న్ ముక్కలకు కలుపుకున్న పిండితో కోట్ చేసుకోవాలి.
5.డీప్ ఫ్రై కోసం బాండిలో ఆయిల్ వేడి చేసి అందులోకి పిండిలో ముంచిన బేబి కార్న్ ముక్కలను వేసుకోవాలి.
6.పకోడిని తిప్పుతూ రెండు వైపులా ఎర్రగా వేపుకుంటే కర కరలాడే బేబి కార్న్ పకోడి రెడీ.