Ulava charu recipe :ఉలవచారు: ఉలవలలో ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని వారంలో రెండు సార్లు తింటే ఎన్నో రకాలుగా మన ఆరోగ్యానికి సహాయపడుతుంది.
కావాల్సిన పదార్థాలు:
ఉలవలు: 2 కప్పులు
టమోటాలు: 4
చింతపండు రసం: 2 స్పూన్లు
ఉల్లిపాయలు: 2
జీలకర్ర: 1 స్పూన్
ఆవాలు: 1 స్పూన్
పచ్చిమిర్చి : 3(మద్యకు కట్ చేసుకోవాలి)
ఎండు మిర్చి: 3
అల్లంపేస్ట్: 1 స్పూన్
కరివేపాకు: రెండు రెమ్మలు
కారం: 1 స్పూన్
ఉప్పు: రుచికి తగినంత
నూనె: సరిపడా
ధనియాలపొడి: 1 స్పూన్
కొత్తిమీర: కొద్దిగా
తయారు చేయు విధానం:
ఉలవలను శుభ్రంగా కడిగి ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. తర్వాత రోజు ఉదయాన్నే ఆ నీటిని తీసివేసి మళ్లీ నీటిని పోసి కుక్కర్‌లో ఉడికించాలి. బాగా ఉడికించిన ఉలవలను మెత్తగా మిక్సీ చేసుకోవాలి.
ఇప్పుడు ఓ పాన్ లో నూనె పోసి వేడి అయ్యాక ఎండుమిర్చి,జీలకర్ర,ఆవాలు, కరివేపాకు వేసి వేగించాలి. దానిలో కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ కూడా వేసి బాగా వేగించాలి.
ఇప్పుడు దీనిలో టమోటా ముక్కలు వేసి ఫ్రై చేయాలి. రెండు నిమిషాల తరువాత కొద్దిగా ఉప్పు,కారం వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉలవల ముద్దను వేసి, చింతపండు రసంను పోసి మరిగించాలి. దించేముందు కొత్తిమీర తరుగు,ధనియాలపొడి వేయాలి. అంతే ఆరోగ్యానికి మంచి చేసే ఉలవచారు రెడీ.