Idli Fingers Recipe: ఇడ్లీ ఫింగర్స్.. ఇడ్లీ బ్యాటర్ రెండు రోజుల తర్వాత పిండి కాస్త పులుపెక్కుతుంది. అలాగే మిగిలిన ఇడ్లీ కాస్తా చల్లారాక తినాలన్న టేస్ట్ గా అనిపించవ్.మిగిలిన ఇడ్లీలతో ఫింగర్స్ చేసి చూడండి.
కావాల్సిన పదార్ధాలు
ఇడ్లీలు– రెండు
కారం – 1 స్పూన్
పెప్పర్ పౌడర్ – ¼ స్పూన్
చాట్ మసాలా – ¼ టీ స్పూన్
ఉప్పు – ½ స్పూన్
నూనె – తగినంత
తయారీ విధానం
1.ముందుగా మసాలా కోసం మిక్సింగ్ బౌల్ లోకి కారం ,మిరియాల పొడి,చాట్ మసాలా ఉప్పు వేసి కలుపుకోవాలి.
2.మిగిలిన ఇడ్లీలలను ఫింగర్స్ లా కట్ చేసుకోవాలి.
3.ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకోని అందులోకి కట్ చేసుకున్న ఇడ్లీ ఫింగర్స్ ని వేసి ఎర్రగా వేపుకోవాలి.
4.వేపుకున్న ఇడ్లీలను ఒక ప్లేట్ లోకి తీసుకోని వాటి పై ముందుగా తయారు చేసుకున్న మసాల మిశ్రమం చల్లు కోవాలి.
5.అంతే వేడి వేడి ఇడ్లీ ఫింగర్ స్నాక్స్ రెడీ.