Weight Loss Home Remedies:కూల్ డ్రింక్స్ స్థానలో నిమ్మరసం తీసుకోవాలి. మార్కెట్ లో దొరికే కూల్ డ్రింక్స్ లో ఎక్కువగా గ్యాస్ ఉంటుంది. అందువలన దీని వలన కూడా పొట్ట పెరిగే అవకాశం ఉంది. తీపి పదార్దాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి.
ప్రతి రోజు స్నేక్స్ కిందా,బ్రేక్ ఫాస్ట్ కిందా పచ్చికూరలు,పళ్ళు తీసుకుంటే పొట్ట తగ్గించుకోవచ్చు. ఆహారాన్ని రోజులో 4 లేదా 5 సార్లు తీసుకుంటే మంచిది. అలాగే రాత్రి బాగా పొద్దుపోయాక ఆహారం తీసుకోకూడదు. అలా తినవలసి వస్తే తేలికగా జీర్ణం అయ్యే ఆహారాన్ని తీసుకోవాలి.
ప్రతి రోజు 45 నిముషాలు తగ్గకుండా వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. బరువును ఎప్పటికప్పుడు తగ్గించుకొనేలా ప్రణాళికలు వేసుకోవాలి. పొట్ట కరిగించుకోవటానికి మందులను,డాక్టర్ లను ఆశ్రయించటం కన్నా ఇంటిలోనే కొన్ని చిట్కాల ద్వారా కూడా తగ్గించుకోవచ్చు.
ఉదయం నిద్ర లేవగానే గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ తేనే,రెండు స్పూన్ల నిమ్మరసం కలిపి త్రాగాలి. ఈ విధంగా కొన్ని నెలల పాటు చేస్తే మంచి పలితాన్ని పొందవచ్చు.
భోజనానికి ముందు గ్లాస్ నీటిలో ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి త్రాగితే క్రమేపి పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు తగ్గుతుంది.
గ్రీన్ టీ అధిక బరువును,పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును సమర్దవంతముగా తగ్గిస్తుంది.
అధిక బరువును,బెల్లి ఫ్యాట్ ను తగ్గించటానికి పుదినా బాగా పనిచేస్తుంది. పుదినాతో పచ్చడి చేసుకొని ప్రతి రోజు భోజనంలో తింటే మంచిది.
బాణ పొట్టను తగ్గించటానికి విటమిన్ సి బాగా సహాయపడుతుంది. విటమిన్ సి లభించే పండ్లను ఎక్కువగా తీసుకుంటే మంచి పలితం కనపడుతుంది. ప్రతి రోజు నిమ్మరసం,ఆరెంజ్ రసం త్రాగితే మంచి పలితం కనపడుతుంది.