Hair Growth Tips: ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ జుట్టుకి సంబందించిన సమస్యలతో బాధపడుతున్నారు. జుట్టు రాలిపోవటం,చుండ్రు సమస్య అనేవి సాధారణం అయ్యిపోయాయి. కాస్త శ్రద్ద పెడితే ఈ సమస్యల నుండి బయట పడవచ్చు.
మందార పువ్వులు,ఆకులు రెండూ కూడా జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి. చర్మంలోని మృత కణాలను తొలగిస్తుంది.. చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలకు చెక్ పెడుతుంది.
మందార పూల నూనెను వారానికి రెండుసార్లు జుట్టుకు మసాజ్ చేసుకుంటే జుట్టు రాలకుండా ఒత్తుగా మారుతుంది. పది మందార పువ్వులు, పది మందార ఆకులను మిక్సిలో వేసి మెత్తని పేస్ట్ గా చేయాలి.
ఈ పేస్ట్ లో ఒక కప్పు కొబ్బరినూనె లేదా ఆలివ్ ఆయిల్ పోసి వేడి చేయాలి. పొయ్యి మీద 2 లేదా 3 నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత ఆ నూనెను వడకట్టి జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి అరగంట తరువాత షాంపూతో తలస్నానం చేయాలి.
ఈ నూనె దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. కాబట్టి కాస్త శ్రద్దగా చేసుకొని ఈ నూనెను వాడితే జుట్టు రాలకుండా ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.