Pesara Vadalu:పెసర వడలు.. పెసలలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందువల్ల వారంలో రెండు సార్లు పెసలను తీసుకుంటే మంచిది. ఎప్పుడు పెసరట్టు వేసుకుంటాం కదా.. ఇప్పుడు వడలు వేసుకుందాం. చాలా రుచిగా ఉంటాయి.
కావలసినపదార్థాలు
పచ్చిపెసలు - ఒక కిలో
నూనె - వేయించటానికి తగినంత
పచ్చిమిర్చి - 50గ్రా
అల్లం - 50గ్రా
జీలకర్ర - టీస్పూను
ఉప్పు - తగినంత
కొత్తిమీర,పుదినా - కొంచెం
తయారుచేసే విధానం
పెసలను శుభ్రంగా కడిగి 3 గంటలు నానబెట్టి, నీళ్లు పూర్తిగా వంపేసి అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి కలిపి కొంచెం గట్టిగా రుబ్బాలి. తగినంత ఉప్పు, కొంచెం పుదినా,కొత్తిమీర కూడా కలపాలి.
ఒక కవర్ లేదా ఒక మందపాటి పేపర్ మీద మనకు కావలసిన సైజులో గారెలుగా వత్తి నూనెలో గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించాలి. ఎంతో రుచిగా ఉండే పెసర వడలు సిద్దం. కొబ్బరి/అల్లం/ కొత్తిమీర... ఏ పచ్చడితో తిన్నా ఇవి చాలా రుచిగా ఉంటాయి.