Tomato for diabetic patients: డయాబెటిస్ ఉన్నవారు తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆహారం అనేది డయాబెటిస్ నియంత్రణలో కీలకం అని చెప్పాలి.
టమాటా మధుమేహా నివారణకు సహాయపడుతుందా అంటే సహాయపడుతుందని చెప్పవచ్చు. టమాటాలో సమృద్దిగా ఉండే లైకోపెన్ అనేది మానసిక ఆనందానికి తోడ్పడుతుంది.
దీని వలన మతిమరుపు తగ్గుతుందని మరియు నేర్చుకొనే సామర్ధ్యం పెరుగుతుందని గుర్తించారు.
ఇవి అన్నీ మధుమేహం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు వచ్చే సమస్యలే.
కెరోటినాయిడ్ పదార్ధం అయిన లైకోపెన్ ఆరోగ్యానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అయితే తాజా అధ్యయనంలో మధుమేహ రోగులలో వచ్చే మెదడు క్షీణతను నియంత్రిస్తుందని తెలిసింది.
దీర్ఘ కాలం పాటు బ్లడ్ గ్లూకోజ్ నిల్వలు నియంత్రణలో లేకపోతే, మెదడులోని నాడి కణాలైన న్యురాన్స్ దెబ్బతింటాయి.
దాని పలితంగా మెదడు పనితీరు, వికాసం దెబ్బతింటాయి. మన ఆహారంలో లైకోపెన్ సమృద్దిగా ఉన్న టమాటా తీసుకోవటం వలన మెదడు క్షీణతను తగ్గించుకోవచ్చు.