Wrinkles On Hands:వయస్సు ప్రభావం ముఖం మీదే కాకుండా చేతుల మీద కూడా పడుతుంది. దాని వలన చేతులు కళ తగ్గి ముడతలు కనిపిస్తాయి. ఎప్పటికప్పుడు చేతులకు మాయిశ్చరైజర్ రాసుకోవటం అనేది ప్రాధమికంగా తీసుకోవలసిన జాగ్రత్త.
చేతులకు ఉదయం మరియు రాత్రుళ్ళు మాయిశ్చరైజర్ రాసుకోవటం తప్పనిసరి. వారానికి ఒకసారి శనగపిండి, పాలు, నిమ్మరసం కలిపి పేస్ట్ చేసి చేతులకు రాసుకొని ఐదు నిముషాలు అయిన తర్వాత కడిగితే చేతుల్లో ఉన్న మృత కణాలు తొలగిపోతాయి.
ఒక స్పూన్ గ్లిజరిన్,అర స్పూన్ నిమ్మరసం, కొద్దిగా రోజ్ వాటర్ కలిపి చేతులకు రాసుకుంటే పోడిదనం తగ్గి అందంగా కనిపిస్తాయి.
చేతులు ఎక్కువగా పోడిబారితే అరటిపండు గుజ్జులో అర స్పూన్ తేనే వేసి బాగా కలిపి చేతులకు రాసుకొని ఆరిన తర్వాత శుభ్రంగా కడగాలి.
గుడ్డులోని తెల్లసొన, ఒక స్పూన్ గ్లిసరిన్, కొద్దిగా తేనే, కొంచెం బార్లి పొడి కలిపి పేస్ట్ గా చేసి దానిని చేతులకు రాసుకుంటే మంచి పలితం ఉంటుంది.