Soaked Peanuts:వీటిలో మోనో అన్ శాచురేటెడ్ ప్యాటి ఆమ్లాలు, పీచు అధికంగా ఉంటాయి. ఇవి
చెడు కొలస్ట్రాల్ పెరగకుండా చేస్తాయి. అలాగే గుండె సంబందిత సమస్యలు రాకుండా చేస్తాయి.
బరువు తగ్గాలని అనుకునే వారు గుప్పెడులో సగం వేరుశనగ గింజలను తింటే మంచిది. కొన్ని గింజలు తింటేనే కడుపు నిండిన భావన కలుగుతుంది.
వీటిని స్నాక్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు. అలసటగా ఉన్నప్పుడు కొన్ని గింజలను తింటే తక్షణ శక్తి లభిస్తుంది. బలహీనంగా ఉన్న పిల్లలకు వీటిని రోజు తినిపించాలి. ఈ విధంగా తినిపించటం వలన పిల్లలు ఉత్సాహంగా ఉంటారు.
వేరుశనగలో విటమిన్ బి, ప్రోటిన్స్, ఐరన్ సమృద్దిగా ఉంటాయి. వేరుశనగ తినటం వలన మన శరీరానికి జింక్,మెగ్నీషియం, విటమిన్ డి లభిస్తాయి. ఎదిగే పిల్లలకు తినిపిస్తే ఎముకలు బలంగా ఉంటాయి. అంతేకాక వీటిలో ఉండే నియాసిన్ జ్ఞాపకశక్తిని పెంచుతుంది.