Garlic Benefits:మన శరీరానికి వెల్లుల్లి చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.ఎందుకంటే వెల్లుల్లి మనకు చాలా మేలు చేస్తుంది. అయితే దీనిని ఉడికించి తినటం కన్నా పచ్చిగా ఉన్నప్పుడు తినటం వలన గుండెకు ఎక్కువ లాభం చేకూరుతుంది.
వెల్లుల్లిలో సమృద్దిగా ఆక్సిడెంట్ ఉండుట వలన వెల్లుల్లి లో ఎక్కువ ప్రయోజనాలు లభిస్తున్నాయి. అయితే ఇందులోని హైడ్రోజెన్ సల్ఫేడ్ కారణంగా గుండెకు మేలు జరుగుతుందని కొన్ని పరిశోదనలలో తెలిసింది.
వెల్లుల్లి ని కోసినప్పుడు,నలకోట్టినప్పుడు రసాయనాల ప్రతి చర్య వలన అందులోంచి హైడ్రోజెన్ సల్ఫేడ్ రసాయనం విడుదల అవుతుంది.ఘాటుగా ఉండే హైడ్రోజెన్ సల్ఫేడ్ రసాయనం శరీరంలో రసాయనాలను చేరవేసే వాహకంగా పనిచేస్తుంది.
అంతేకాక రక్తనాళాలు విప్పారి విశ్రాంతిగా ఉండేలా చేస్తుంది. పలితంగా రక్త ప్రవాహం సాఫీగా జరుగుతుంది. ఈ విధంగా గుండెకు మేలు జరుగుతుంది. ఈ విధమైన సామర్ధ్యం ఉడికించిన వెల్లుల్లిలో తక్కువగా ఉంటుంది.అందువల్ల పచ్చి వెల్లుల్లి తింటేనే మంచిది.