How to control diabetes:నల్ల ద్రాక్ష అనేది అనేక ఆరోగ్య సమస్యలను అదుపులో ఉంచుతుంది. ఏ వయస్సు వారైనా ప్రతి రోజు కొన్ని ద్రాక్ష పండ్లను తింటే చాలా మంచిదని నిపుణులు చెప్పుతున్నారు.
నల్ల ద్రాక్షలో తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెర శాతాన్ని నియంత్రిస్తుంది. అలాగే ఇన్సులిన్ శాతాన్ని కూడా క్రమబద్దీకరణ చేస్తుంది. మధుమేహంతో బాధపడేవారికి ద్రాక్ష ఎంతో మేలు చేస్తుంది.
ఇవి గుండె జబ్బులను కూడా దూరం చేస్తాయని మిషిగన్ విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణులు చెప్పుతున్నారు. ద్రాక్షలో ఉండే పైటో కెమికల్స్ గుండె కవాటాలు పాడవకుండా కాపాడతాయి.
రక్తపోటుతో బాధపడేవారు ప్రతి రోజు గుప్పెడు ద్రాక్ష పండ్లను తింటే మంచిది. దీని వలన కొలస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుంది. చదువుకొనే పిల్లలు తరచుగా తినటం వలన మెదడు చురుగ్గా మారి ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే మతిమరుపు సమస్య దూరం అవుతుంది.
దీనిలో యాంటి ఆక్సి డెంట్స్ సమృద్దిగా ఉండుట వలన గాయాలు అయినప్పుడు రక్తం తొందరగా గడ్డ కట్టటానికి సహాయపడుతుంది. అలాగే దీనిలో పాలిపినల్ శాతం ఎక్కువగా ఉండుట వలన శరీరం లో క్యాన్సర్ కణాలు రాకుండా ఎప్పటికప్పుడు పోరాటం చేస్తుంది. ఎండిన ద్రాక్షను తీసుకున్న మంచిదే. ఇది మహిళల్లో వచ్చే ఆస్టియో ప్లోరోసిస్ నుండి కూడా రక్షిస్తుంది.