Blackheads Cure: సాదారణంగా ప్రతి ఒక్కరిని బాధించే సమస్యలలో ఇది ఒకటి. ఇవి సాదారణంగా ముక్కు ప్రాంతంలో వస్తాయి. వీటిని తగ్గించటానికి తప్పనిసరిగా కొంత శ్రద్ద పెట్టాల్సిన అవసరం ఉంది.
అర స్పూన్ తేనెలో అర స్పూన్ వంట సోడా కలిపి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. పావుగంట తర్వాత దూదితో శుభ్రంగా తుడవాలి. ఈ విధంగా తరచుగా చేస్తుంటే బ్లాక్ హెడ్స్ తగ్గుతాయి.
రెండు స్పూన్ ల నిమ్మరసం,రెండు స్పూన్ ల పెరుగు తీసుకోని బాగా కలిపి ముఖానికి రాసి నెమ్మదిగా మర్దన చేయాలి. ఇది ఆరిన తర్వాత శుభ్రంగా కడగాలి. ఈ విధంగా రెండు రోజులకు ఒకసారి చేస్తే మృత కణాలు తొలగిపోతాయి. అలాగే నల్ల మచ్చలు కూడా తగ్గిపోతాయి.
చాలా సౌందర్య సాధనాలలో శాలిసిలిక్ అనే రసాయనం ఉంటుంది. ఈ రసాయనం ఉన్న స్క్రాబ్ వాడటం వలన బ్లాక్ హెడ్స్ సులభంగా తగ్గుతాయి. ఈ మార్పు అనేది ఒక్కరోజులో రాదు. తరచుగా చేస్తుంటే మార్పు కనిపిస్తుంది.