Skin Burn Tips:ఈ కాలంలో అయ్యే గాయాలు తొందరగా తగ్గవు. అయితే ఇంటిలో కొన్ని చిట్కాలను పాటిస్తే గాయాల నుండి తొందరగా ఉపశమనం పొందవచ్చు. మన ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే వస్తువులను ఉపయోగించి ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.
వెనిగర్
దీనిలో దురదను తగ్గించే గుణం అధికంగా ఉంటుంది. అందుకే గాయాలు అయినప్పుడు, దెబ్బలు తగిలి రక్తం కారుతున్నప్పుడు వెనిగర్ తో శుభ్రం చేసుకుంటే త్వరగా తగ్గుతాయి. అంతేకాక ఆ ప్రాంతంలో దుమ్ము, ధూళి కూడా చేరవు.
తేనే
వంటగదిలో తరచుగా చేతులు కాలుతూ ఉంటాయి. అందువల్ల తేనెను అందుబాటులో ఉంచుకుంటే మంచిది. ఇది యాంటి బ్యాక్టిరియాల్ కారకంగా పనిచేస్తుంది. కాలిన చోట కొంచెం తేనే రాసి గాలి తగిలే చోట ఉంటే నొప్పి, మంట తొందరగా తగ్గుతాయి.
కలబంద గుజ్జు
ఇది కూడా తేనే మాదిరిగానే చర్మ సమస్యలకు బాగా పనిచేస్తుంది. ఈ గుజ్జును గాయాలు,పుండ్లు,దద్దుర్లు మీద పూతలా రాయాలి. పావుగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే సమస్య తొందరగా తగ్గుతుంది.
టీ బ్యాగ్స్
వ్రేళ్ళు కోసుకున్నప్పుడు,కాలినప్పుడు ఫ్రిజ్ లోనించి తీసిన టీ బ్యాగ్ లను ఆ ప్రాంతంలో ఉంచి నెమ్మదిగా మర్దన చేయాలి. దీని వలన రక్తం కారుతూ ఉంటే ఆగుతుంది. అంతేకాక నొప్పి కూడా తగ్గుతుంది. ఇన్ ఫెక్షన్ బారిన పడకుండా సహాయపడుతుంది.