Rose Face Pack:ప్రేమకు సంకేతం అయిన గులాబీ చూడటానికి ఎంత అందంగా ఉంటుందో..... చర్మ సౌందర్యం పెంచటానికి కూడా అంటే తోడ్పడుతుంది. గులాబీతో అందాన్ని ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం.
గులాబీ రేకులను ముద్దగా చేసి కొంచెం నీరు పోసి ఉడికించాలి. కొంతసేపు అయ్యాక ఆ నీటిని వడగట్టి మీ ముఖాన్ని కడుకుంటే యాంటి బ్యాక్టిరియాల్ ఫేస్ వాష్ లా పనిచేస్తుంది. మొటిమల సమస్యలు, ఎగ్జిమా వంటి సమస్యలు తగ్గుతాయి.
చర్మం ఎర్రగా కందినప్పుడు కొద్దిగా గులాబీ నూనెను తీసుకోని ఆ ప్రాంతంలో మర్దన చేస్తే సమస్య చాలా త్వరగా తగ్గుతుంది.
గులాబీ లో యాంటి ఆక్సి డెంట్, విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన మృత చర్మాన్ని దూరం చేసి కొత్త కణాల వృద్దికి సహాయపడుతుంది.
ఒక కప్పు నీటిలో గుప్పెడు గులాబీ రేకలను వేసి రెండు గంటలు నానబెట్టి, ఆ తర్వాత నీటిని వడకట్టి ఆ గులాబీ రేకులను మెత్తగా పేస్ట్ చేసి తేనే కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పావు గంట అయ్యాక శుభ్రం చేసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది.
గులాబీ రేకులలో కొంచెం పంచదార వేసి మెత్తగా పేస్ట్ చేసి ముఖానికి పట్టిస్తే చర్మం శుభ్రపడి మంచి నిగారింపు సంతరించుకుంటుంది.