Kurkure Recipe : బ‌య‌ట షాపుల్లో కొన‌కుండా కుర్ కురేల‌ను ఇంట్లోనే ఇలా త‌యారు చేయండి..!

Homemade Kurkure:Kurkure తినద్దని ఎంత చెప్పినా పిల్లలు మన మాట లెక్క చేయరు. అవే కావాలని మారాం చేస్తారు. వాళ్ళని మరిపించడానికి ఈజీగా మనం ఇంట్లోనే crispy కురుకురే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి హెల్దీగా ఉంటాయి ఈజీగా చేసుకోవచ్చు. టీ టైమ్ snack లాగా, ఈజీ snack రెసిపీ గా ప్రిపేర్ చేసుకోవచ్చు.

కావలసినవి:
ఒక కప్పు రైస్ ఫ్లోర్ ,అరకప్పు శనగపిండి ,రెండు స్పూన్లు గోధుమపిండి రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ వంటసోడా ,రెండు కప్పులు నీళ్లు.

కురుకురే మసాలా పొడి:
రెండు స్పూన్ల కారం, పావు టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ అంటే డ్రై మ్యాంగో పౌడర్, ఒక టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్ ,పావు టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మసాలా పొడి kurkureకే కాకుండా మనం frys వేయించుకున్నప్పుడు కూడా చల్లుకుంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి.

చేసే విధానం:
ఒక బౌల్ తీసుకొని అందులో కప్పు రైస్ ఫ్లోర్ అరకప్పు, శనగపిండి ,గోధుమపిండి ,ఉప్పు వంటసోడా వేసి రెండు కప్పులు వాటర్ పోస్తూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కొంచెం జారుగా దోస పిండి consistency లాగా కలుపుకొని పొయ్యి మీద పెట్టి కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే దగ్గరగా అవుతుంది కదా ఆ దగ్గర అవుతూ ఉన్నప్పుడు ఒక్క స్పూన్ నెయ్యి వేసి బాగా కలపాలి .

లో ఫ్లేమ్ లోనే బాగా దగ్గరగా గట్టిపడే వరకు కలుపుతూ స్మూత్ గా అయ్యేలాగా చూసుకోవాలి .పిండి రెడీ అయింది అని ఎలా తెలుసుకోవాలి అంటే అది రెడీ అయిన తర్వాత ఉండ రావాలి .మూత పెట్టి కొంచెం సేపు ఉంచి ఆఫ్ చేసేసి కొంచెం చల్లారనివ్వాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే అందులో ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి కలుపుకోవాలి.

రెండు ఇంచుల పొడవు ,పావు ఇంచు వెడల్పు వచ్చేలాగా చపాతీ పిండి లాగా roll చేసుకుంటూ కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఆయిల్ డీప్ ఫ్రై చేయడానికి ప్రిపేర్ చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేవరకు క్రిస్పీగా ఏగించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. అది బ్రేక్ చేస్తే ఈజీగా బ్రేక్ అయ్యేలా ఉండాలి.

వేగిన తర్వాత టిష్యూ పేపర్ తీసుకొని దాని మీద పెట్టుకోవాలి. రెండు మూడు స్పూన్లు కురుకురే మసాలా చల్లి వాటిని బాగా కలుపుకుంటే క్రిస్పీ క్రిస్పీగా కురుకురే రెడీ. బయట kurkure స్టైల్ లో అదే ఫ్లేవర్ వచ్చే విధంగా మనం ఇంట్లో ఆ మసాలాని తయారు చేసుకొని కరకరలాడుతూ క్రిస్పీగా కురుకురేని తయారు చేసుకోవచ్చు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top