
Chocolate Pani Puri: నార్మల్ గా చేసుకొనే pani puri కాకుండా ఇలా చాక్లెట్ తో pani puri చేస్తే వైరిటిగా ఉండటమే కాకుండా పిల్లలు బయట ఫుడ్ జోలికి వెళ్ళకుండా ఉంటారు.
కావలసిన వస్తువులు
పూరీలు - 10, ఇన్‌స్టంట్ కాఫీ పౌడర్ - టీ స్పూన్, పంచదార - 3 టీ స్పూన్లు, నీళ్లు - 2 కప్పులు, చాకోస్ - పావు కప్పు, జీడిపప్పు, బాదం - 10, మిల్క్ చాక్లెట్ బార్ - 1
తయారీ విధానం
గిన్నెలో నీరు పోసి పొయ్యి మీద పెట్టి మరిగించాలి. ఈ మరిగిన నీటిలో పంచదార, కాఫీ పొడి వేసి కలిపి కిందకి దించాలి. ఇది చల్లారిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇప్పుడు జీడిపప్పు, బాదం, మిల్క్ చాక్లెట్ బార్ లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చాకోస్‌తో కలిపి పక్కన పెట్టుకోవాలి.
సర్వ్ చేయటానికి ముందు పూరీల మధ్యలో డొల్ల చేసి, దానిలో పైన తయారుచేసుకున్న చాకోస్, చాక్లెట్ మిశ్రమం వేసి, దాని మీద రెండు స్పూన్స్ కోల్డ్ కాఫీ వేసి సర్వ్ చేయాలి. చాక్లెట్ అంటే ఇష్టపడేవారికి ఈ పానీపూరీ చాలా బాగా నచ్చుతుంది.