Cauliflower biryani:క్యాలీఫ్లవర్ బిరియానీ..కొంత మంది క్యాలీఫ్లవర్ వాసన నచ్చక తినటానికి ఇష్టపడరు. అలాంటి వారు కూడా Cauliflower biryani ని చాలా ఇష్టంగా తింటారు.
కావలసిన పదార్దాలు
బాస్మతి బియ్యం - ఒకటిన్నర కప్పులు
నీరు - మూడు కప్పులు
ఒక ఉల్లిపాయ, రెండు పచ్చిమిర్చి - ఈ రెండిటినీ మెత్తగా పేస్ట్ చేయాలి
టొమాటో గుజ్జు - అర కప్పు
పచ్చిబఠాణీ - గుప్పెడు
మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ - 1
నెయ్యి లేదా నూనె - టేబుల్ స్పూన్
ఉప్పు - తగినంత
కొత్తిమీర - కొద్దిగా
మసాలాకోసం
జీలకర్ర - అర టీ స్పూను
ధనియాల పొడి - టీ స్పూను
ఏలకులపొడి - టీ స్పూను
పసుపు - చిటికెడు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను
బిరియానీ మసాలా - టేబుల్ స్పూను
తయారీ విధానం
ముందుగా మూడు కప్పుల నీటిలో బాస్మతి బియ్యాన్ని ఉడికించాలి. ఉడుకుతున్న సమయంలోనే కొద్దిగా ఉప్పు వేసి ఉడికిన అన్నాన్ని పక్కన పెట్టుకోవాలి.
పొయ్యి వెలిగించి బాణలి పెట్టి దానిలో కొద్దిగా నెయ్యి వేసి వేడిచేసి అందులో ఉల్లి, పచ్చిమిర్చి పేస్ట్‌ను వేసి గోల్డ్ కలర్ వచ్చేవరకు వేగించాలి.
ఆ తర్వాత జీలకర్ర, ధనియాల పొడి, ఏలకులపొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిరియానీ మసాలా వేసి, ఘుమ ఘుమలాడే వాసన వచ్చేవరకు వేగించాలి.
ఆ తర్వాత పచ్చిబఠాణీ, టొమాటో గుజ్జు, క్యాలీఫ్లవర్ తరుగు వేసి కలపాలి. ఇవన్నీ మెత్తగా అయ్యేవ రకు చిన్న మంట మీద ఉడికించాలి.
అవసరమైతే కొంచెం నీటిని పోయాలి. ఈ మిశ్రమాన్ని ఉడికించి ఉంచిన అన్నంలో కలపాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఘుమ ఘుమలాడే క్యాలీఫ్లవర్ బిరియానీ రెడీ.