ఈ మధ్యకాలంలో మారిన జీవనశైలి, ఆహార పలవాట్లు, ఒత్తిడి, నిద్ర సరిగా లేకపోవడం వంటి అనేక రకాల కారణాలతో చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు వస్తున్నాయి. దీని కారణంగా 30 ఏళ్లకే ఎక్కువ వయసు వారిగా కనిపిస్తున్నారు.
అలా కాకుండా యంగ్ గా కనపడాలంటే ఇప్పుడు చెప్పే ఫేస్ ప్యాక్ వారంలో రెండు సార్లు వేసుకుంటే సరిపోతుంది.
ఒక బౌల్ లో ఒక స్పూన్ ఆరంజ్ పీల్ పౌడర్, అర స్పూన్ పసుపు, అర స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఎగ్ లో తెల్లసొన వేసి అన్ని బాగా కలిసేలా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి పది నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే సరిపోతుంది. ఈ ప్యాక్ వేయడం వలన ముడతలు, మొటిమలు, నల్లని మచ్చలు కూడా తొలగిపోతాయి.


