ప్రతిరోజు మనం వంటింట్లో ఆవాలను వాడుతూ ఉంటాం. ఆవాలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అయితే ఆవాల్లో బ్యూటీ ప్రయోజనాలను కూడా దాగి ఉన్నాయి. ఈ విషయం మనలో చాలామందికి తెలియదు. ఆవాలు జుట్టు రాలే సమస్యను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది.
మిక్సీ జార్ లో మూడు స్పూన్ల ఆవాలు, ఒక స్పూన్ మెంతులు వేసి మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. ఈ పొడిలో రెండు స్పూన్ల పెరుగు, ఒక స్పూన్ ఆముదము, ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి అన్నీ కలిసేలా బాగా కలపాలి.
ఈ మిశ్రమంను జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి గంట అయ్యాక కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అలాగే తెల్లజుట్టు సమస్య కూడా తొలగిపోయి నల్లగా మారుతుంది.


