Beerakaya Pachadi:బీరకాయ పచ్చడి ఇలా చేసిచూడండి రుచి అదిరిపోతుంది

రోటి పచ్చడి అనగానే అన్నీ బావుంటాయి. ఇందులో బీరకాయ పచ్చడి కూడా చాలా బాగుంటుంది. వేడి అన్నంలో నెయ్యి వేసి తింటే చాలా బాగుంటుంది ఇలా మీరు కూడా చేసుకోండి.

కావలసినవి:
ఒక స్పూన్ - ధనియాలు, ఒక స్పూన్ - జీలకర్ర, ఆరు - పచ్చిమిర్చి, నాలుగు - ఎండుమిర్చి, నిమ్మకాయ సైజు చింతపండు, బీరకాయలు సుమారు 400 గ్రాముల ముక్కలు, నాలుగు - వెల్లుల్లి రెబ్బలు , కరివేపాకు, కొత్తిమీర.

చేసే విధానం:
ముందుగా పాన్ లో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఒక స్పూన్ జీలకర్ర వేయండి. అర టీ స్పూన్ ధనియాలు వేసి వేయించుకోండి. కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి , రెండు తీసుకోవచ్చు లేదా పచ్చిమిర్చి ఒక్కటే వేసుకోవచ్చు. అది మీ ఇష్టం. వేసి ఇంకొంచెం సేపు వేపండి .

ఇది పక్కన పెట్టేసి మళ్ళీ అదే పాన్లో రెండు స్పూన్ల ఆయిల్ వేసి బీరకాయ చిన్న ముక్కలుగా తరిగి కొంచెం ముదిరిన పరవాలేదు మరీ కాదు , తొక్కు బాగా తీయనవసరం లేదు ఎలా ఉన్నా వేసుకోవచ్చు. వేసి బాండీలో కలుపుతూ మగ్గనివ్వండి .కొంచెం పసుపు వేసి మూత పెట్టి మగ్గ పెట్టండి.

నీరు ఇగిరే వరకు ఉంచి అందులో నిమ్మకాయ అంత చింతపండు వేసి కొంచెం కొత్తిమీర వేసి మరొకసారి మూత పెట్టండి .ఇది చల్లారే లోపు ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర ని ఒక పావు కప్పు కొబ్బరి వేసుకుంటే బాగుంటుంది. వేసుకోకపోయినా పర్వాలేదు... మీ ఇష్టం.

వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మిక్సీ వెయ్యండి. కొంచెం తిప్పాక బీరకాయ ముక్కల్ని కూడా వేసి కచ్చాపచ్చాగా మరొక్కసారి తిప్పండి. దీనికి కొంచెం పోపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. జీలకర్ర, శనగపప్పు ,ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి పోపు పెట్టుకోండి. మిక్సీ పట్టిన పచ్చడి ఈ పోపులో ఒక్క నిమిషం ఆయిల్ లో వేసి కలిపి తీసేసుకోండి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top