ఈ మధ్య కాలంలో జుట్టుకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఎక్కువగా కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ వాడటం, జుట్టుకు సరైన పోషణ లేకపోవడం వంటి అనేక రకాల కారణాలతో చుండ్రు, జుట్టు రాలే సమస్య వంటివి ఎక్కువగా వస్తున్నాయి.
తలలో చుండ్రు ఉంటే దురద విపరీతంగా వస్తుంది. చుండ్రు కారణంగా జుట్టు రాలే సమస్య వస్తుంది. చుండ్రు సమస్యను తగ్గించుకోవటానికి కర్పూరం చాలా అద్భుతంగా సహాయపడుతుంది. ఒక బౌల్ లో నాలుగు లేదా ఐదు కర్పూరం బిళ్ళలను తీసుకొని మెత్తని పౌడర్ మాదిరిగా తయారు చేసుకోవాలి.
దానిలో రెండు స్పూన్ల కొబ్బరినూనె, రెండు స్పూన్ల నువ్వుల నూనె వేసి బాగా కలిపి పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి. ఈ నూనెను రాత్రి పడుకోవడానికి ముందు తల మీద చర్మం మొత్తం బాగా పట్టేలాగా పట్టించి మరుసటి రోజు ఉదయం కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి.
ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే చుండ్రు సమస్య తొలగిపోతుంది. జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది . అంతేకాకుండా తల నుంచి దుర్వాసన కూడా తగ్గుతుంది.


