బ్రేక్ ఫాస్ట్ ఇడ్లీ, దోస, గారి అన్నిట్లోకి అల్లం చట్నీ కాంబినేషన్ బాగుంటుంది . అల్లం చట్నీ చాలా ఈజీగా చేసుకునే విధానం ఇక్కడ చూసేద్దాం.
కావలసినవి:
ఒక టేబుల్ స్పూన్ - పచ్చి శనగపప్పు,, ఒక టేబుల్ స్పూన్ - మినప గుళ్ళు, కొంచెం మెంతులు, ఒక స్పూను - ధనియాలు ,అర స్పూను - జీలకర్ర, 20 గ్రాముల - అల్లం, 10 - ఎండు మిరపకాయలు, 20 గ్రాముల - చింతపండు, 20 గ్రాములు - బెల్లం, వెల్లుల్లి - 10 రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు,
పోపు - అర టీ స్పూన్ ఆవాలు, పావు స్పూను జీలకర్ర, ఒక టీ స్పూన్ మినప గుళ్ళు, ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు, కొంచెం ఇంగువ, పసుపు, రెండు ఎండుమిర్చి ,10 - వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు.
చేసే విధానం:
ఒక pan లో రెండు స్పూన్ల నూనె వేసి కొంచెం మెంతులు ముందుగా వేసి అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిశనగపప్పు, మినప గుళ్ళు వేసి ఎర్రగా వేయించాలి .ఒక్క నిమిషం తర్వాత అల్లం ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఎండుమిరపకాయలు తుంచి వేసుకోండి, కారం ఎక్కువ తినలేక పోతే రెండు తగ్గించి వేసుకోండి.
తర్వాత చింతపండు విడదీసి వేసుకోవాలి ,బెల్లం కూడా క చిదిపి వేసుకోండి, వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఉప్పు వేసి కొద్దిసేపు వేయించుకోండి. పావు కప్పు వాటర్ పోసి మూత పెట్టి కొద్దిగా దగ్గర అయ్యే వరకు ఉడకనివ్వండి. రెండు నిమిషాల తర్వాత ఆఫ్ చేసేయండి.
చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో ఇవన్నీ తీసుకొని నీళ్లు పోయకుండా ముందుగా ఒకసారి తిప్పండి. తర్వాత కాచి చల్లార్చిన నీటిని పోస్తూ మిక్సీ తిప్పుకోండి. Consistency చూసుకోండి. తర్వాత పోపు వేసి ఈ పచ్చడిని పోపులో వేసి ఒక్క నిమిషం కలబెట్టి తీసేయండి. అంతేనండి బ్రేక్ఫాస్ట్ చట్నీ అల్లం చట్నీ టేస్ట్ చట్నీ రెడీ.


