ఎప్పుడూ చేసుకుని పూరీలె కాకుండా ఇలా డిఫరెంట్ గా కొబ్బరి పూరీలు చేసుకోండి పిల్లలు ఇష్టంగా తింటారు ఉత్తినే కూడా తినేయొచ్చు. అంత టేస్టీగా ఉంటాయి చేసేద్దాం మరి.
కావలసినవి:
కొబ్బరి ముక్కలు - అరకప్పు, పచ్చిమిర్చి - నాలుగు, అల్లం - ఒకటిన్నర ఇంచు ,వెల్లుల్లి రెబ్బలు - 10 ,ఒక స్పూన్ - జీలకర్ర ,కొంచెం కొత్తిమీర, సరిపడా ఉప్పు
చేసే విధానం:
ఒక మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి ,జీలకర్ర, అల్లం ,వెల్లుల్లి ,ఉప్పు ,కొత్తిమీర వేసి మిక్సీ పట్టాలి. కొంచెం వాటర్ పోసి grind చేయండి. వాటర్ చాలా తక్కువ ఉండాలి. చట్నీకి ఎలా చేస్తామో అలా ఉండాలి .ఎక్కువ వాటర్ పోస్తే పిండి జారు అయిపోతుంది .
బాగా నలిగేలా చూసుకోండి. ఈ పేస్ట్ పక్కన పెట్టుకోండి .ఒక plate తీసుకొని ఈ పేస్ట్ ని పెట్టుకోండి. దానికి కన్సిస్టెన్సీ సరిపడా ఒక కప్పు బియ్యప్పిండి గాని, గోధుమపిండి గాని, మైదా కానీ ఏదైనా సరే ఆ పేస్ట్ కి సరిపడా పట్టేంతగా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా వచ్చేలాగా ముద్దలాగ కలుపుకోవాలి.
అందుకే వాటర్ చాలా తక్కువ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కలుపుతూ ఉంటే మనకి కరెక్ట్ గా చపాతీ ముద్దలా వస్తుంది. ఇంచుమించు ముప్పావు కప్పు పిండి పడుతుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ చేతికి తడుపు గ్రీస్ చేసుకొని చిన్న చిన్న ముద్దలు చేసుకోండి.
ఒక బట్టర్ పేపర్ గాని, పాలిథిన్ పేపర్ కానీ పొడవుగా కట్ చేసుకుంటే ఒక హాఫ్ పూరి ముద్దను పెట్టి ఇంకొక హాఫ్ ఫోల్డ్ చేసుకోవడానికి బాగుంటుంది. తీసుకొని ఆయిల్ గ్రీస్ చేసుకొని , ఇక్కడ చపాతీ కర్ర అవసరం లేదు ఆ ముద్దని అలా పెట్టి చేతితో ఒత్తుకోవచ్చు .
సాఫ్ట్ గా ఈజీగా పూరి thickness చూసుకొని చేసుకోండి. బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె తీసుకొని కాగిన తర్వాత ఈ పూరిని అందులో వేసి ఒకసారి లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వాటిని తిప్పుకుంటూ వేగించుకోండి అంతేనండి కొబ్బరి పూరీలు.


