Cooked rice dosa:మిగిలిన అన్నం పాడేస్తున్నారా....ఇలా దోసెలు వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి

మనం ఎంత జాగ్రత్తగా వండిన అన్నం ఒక్కోసారి మిగిలిపోతుంది. ఆ అన్నంను పాడేయకుండా దోసెలుగా వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.

కావలసిన పదార్ధాలు
దోసె పిండి కోసం:
3 కప్పు దోస బియ్యం
¼ కప్పు మినపప్పు
½ స్పూన్ మెంతులు
నీరు (నానబెట్టడానికి)
1½ కప్పు వండిన అన్నం
1 స్పూన్ ఉప్పు

స్పైసీ టొమాటో చట్నీ కోసం:
3 స్పూన్ నూనె
1 టేబుల్ స్పూన్ శనగ పప్పు
4 ఎండు ఎర్ర మిరపకాయలు
3 ఉల్లిపాయలు (తరిగిన)
1 వెల్లుల్లి
1 టమోటా (తరిగిన)
చిన్న నిమ్మకాయంత చింతపండు
½ స్పూన్ ఉప్పు
నీరు (గ్రౌండింగ్ కోసం)

తయారి విధానం
ముందుగా, ఒక పెద్ద గిన్నెలో 3 కప్పు దోస బియ్యం, ¼ కప్పు మినప పప్పు మరియు ½ స్పూన్ మెంతులు తీసుకోండి. నీటితో శుభ్రం చేసి నీటిని పోసి 4 గంటల పాటు నానబెట్టండి. ఆ తర్వాత శుభ్రంగా కడిగి నీటిని తీసివేసి మెత్తగా రుబ్బుకోవాలి.

ఈ పిండిని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు 1½ కప్పు వండిన అన్నం తీసుకుని, అవసరమైన విధంగా నీటిని కలుపుతూ మెత్తని పేస్ట్ గా చేసి మిక్సీ చేసిన పిండిలో కలపాలి. ఈ పిండిని 8 గంటల పాటు అలా వదిలేస్తే పులుస్తుంది.

పిండిలో ఉప్పు కలిపి దోసెలు వేసుకోవాలి. ఈ దోసెలకు స్పైసీ టొమాటో చట్నీ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్పైసీ టొమాటో చట్నీ తయారి కూడా తెలుసుకుందాం.

స్పైసీ టొమాటో చట్నీ
ముందుగా, ఒక పాన్‌లో 3 టీస్పూన్ల నూనె వేడి చేసి, 1 టేబుల్ స్పూన్ శనగ పప్పు మరియు 4 ఎండు మిరపకాయలను వేసి వేగించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు,వెల్లుల్లి వేసి వేగించాలి. ఆ తర్వాత టమోటా ముక్కలు వేసి టమోటా మెత్తబడ్డాక చల్లార్చి...మిక్సీ జార్ లో వేయాలి.

ఆ తర్వాత చింతపండు,ఉప్పు వేసి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ మిశ్రమాన్ని బౌల్ లోకి తీసుకోని తాలింపు పెట్టాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top