IceCream: పిల్లలకి ఇష్టమైన ఐస్క్రీమ్ తో పాటు చాక్లెట్ ఫ్లేవర్ అబ్బా నోరూరిపోతుంది ఏదో బయటకు వెళ్ళినప్పుడు సరదాగా ఇప్పించడం వేరు. అదే రోజు కావాలని మారం చేస్తే అబ్బో భరించడం కష్టం.
అందుకే ఇంట్లో మనకి available గా ఉన్న items ని ఉపయోగించి పాలు ,పంచదార ,చాక్లెట్ flavours తో చేసి పెడితే ఈ సమ్మర్ లో వాళ్ళు కూల్ కూల్ గా, ఇష్టంగా, రోజు బయట తిప్పనవసరం లేకుండా enjoy చేసేయొచ్చు. వాళ్లతో పాటు మనం కూడా enjoy చేయొచ్చు. ఇంకా ఇంట్లో తయారు చేయడం వల్ల hygenic కూడా ఉంటుంది.
కావలసినవి:
అర లీటర్ full fat milk, పాల మీద మీగడ మూడు నాలుగు రోజుల నుంచి తీసిపెట్టుకున్నది, రెండు స్పూన్లు కార్న్ ఫ్లోర్, రెండు స్పూన్ల షుగర్, ఒక డార్క్ చాక్లెట్, టూటీ ఫ్రూటీ బిట్స్ ,Choco బిట్స్.
చేయు విధానం:
అర లీటర్ పాలను సగం పైగా చిక్కగా మరిగించాలి. అదే మామూలుగా గేదె పాలు తీసుకుంటే మనకి ఎక్కువ సమయం పడుతుంది . ఫ్యాట్ మిల్క్ తీసుకోవటం వల్ల త్వరగా చిక్కబడతాయి. మరిగించుకుంటూ పక్కన ఒక చిన్న బౌల్ లో రెండు స్పూన్ల కార్న్ ఫ్లోర్, కొంచెం పాలు కలిపి mix చేసి ఉంచుకోండి.
ఇప్పుడు మరుగుతున్న పాలల్లో రెండు స్పూన్ల షుగర్ వేసి కలుపుకోవాలి. దాంతో పాటు కలిపిన corn milkమిక్స్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. కార్న్ milk కలిపిన వెంటనే పాలు మనకి ఇంకా చిక్కబడుతూ ఉంటాయి.Thick Consistency వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ మిశ్రమం చల్లారేసరికి ఇంకొంచెం దగ్గరగా Thick గా ఉంటుంది.
ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోకి కాచి చల్లారిన పాలను తీసుకొని, మూడు నాలుగు రోజుల నుంచి వచ్చిన ఫ్రెష్ పాల మీద మీగడ, ఎంత ఎక్కువ ఉంటే అంత వేసుకోవచ్చు లేదా ఫ్రెష్ క్రీమ్ ఉంటే కూడా వేసుకోవచ్చు. కొంచెం వేనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకుని మూడు నిమిషాలు పాటు మిక్స్ చేసి తర్వాత ఒక బాక్స్ తీసుకొని ఆ బాక్స్ లో dip చేయండి. box ని డీప్ ఫ్రిజ్లో ఒక ఐదు ఆరు గంటలు పెట్టుకోవాలి.
కొంచెం ఐసిఐసి గా ఉంటుంది అయినా పర్వాలేదు మళ్లీ ఇంకొకసారి మూడు నిమిషాల పాటు మిక్సీ వేసుకోవాలి .ఐస్ క్రీమ్ ఎప్పుడూ కూడా టూ, త్రీ టైమ్స్ మిక్సీ వేసుకుంటే చాలా సాఫ్ట్ గా ఉంటుంది. మళ్లీ ఈ మిశ్రమాన్ని ఒక స్టీల్ బాక్స్ తీసుకొని దాంట్లో ఆఫ్ కి dip చేసి ఒక పాల కవర్ తో క్లోజ్ చేసి మూత పెట్టేసి మళ్ళీ డీ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి.
ఇలా కవర్ పెట్టడం వల్ల గాలి చొరపడకుండా ఐస్ క్రీమ్ structure మారకుండా ఉంటుంది. ఇది ఒక రకం ఐస్ క్రీమ్ ఇలా చేస్తే ఇది వెనిలా ఐస్ క్రీమ్.
మిగిలిన సగం మిశ్రమంతో డార్క్ చాక్లెట్ యాడ్ చేయడం వల్ల చాక్లెట్ ఐస్క్రీమ్ గా కూడా చేసుకోవచ్చు. అంటే ఒకేసారి టూ టైప్స్ ఆఫ్ ice creams ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఒక డార్క్ చాక్లెట్ తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోండి. లేకపోతే కోకో పౌడర్ ఉంటే అది కూడా తీసుకో వచ్చు. కట్ చేసిన పీసెస్ ని వేడి నీళ్లు మరగపెట్టి అందులో వేసి paste లాగా తయారు చేసుకోవాలి . ఆ తర్వాత ఆ మిగిలిన ఐస్క్రీమ్ ని జార్లోకి వేసుకొని ఈ కోకో paste ని కూడా అందులో వేసి మళ్లీ మూడు నిమిషాల పాటు మిక్సీ పట్టుకోవాలి.
ఒక బాక్స్ తీసుకొని మళ్లీ అందులో ఈ కంటెంట్ dip చేసి ఒక పాలిథిన్ కవర్ తో close చేసుకొని మూత పెట్టేయాలి .ఎలా అయితే vennela ice cream పెట్టామో దీన్ని కూడా అట్లా పెట్టుకొని 9 to 10 hours ఉంచిన తర్వాత బయటకు తీస్తే ,ఆ కవర్ తీసేయంగానే మీకు solid గా గట్టిగా వస్తుంది.
వాటి మీద మనం tuti-fruit pieces- వెనిలా ఐస్ క్రీమ్ మీద, కోకో బిట్స్- చాక్లెట్ ఐస్ క్రీమ్ మీద డెకరేట్ చేసుకుంటే ప్రతి biteకి pieces చేరి టేస్టీగా ఉంటుంది. Lengthy ప్రాసెస్ గా ఉన్నప్పటికీ రిపీటెడ్ ప్రాసెస్ కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు.