Dates health benefits: ఈ మధ్యకాలంలో మనలో చాలామంది డ్రై ఫ్రూట్స్ తింటున్నారు. వాటిలో ఖర్జూరం తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం. ఖర్జూరంలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్, పొటాషియం, క్యాల్షియం, పాస్పరస్ వంటివి సమృద్ధిగా ఉంటాయి.
ప్రతిరోజు రెండు ఖర్జూరాలు తింటే ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు. ఖర్జూరంలో మెగ్నీషియం, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వల్ల కీళ్ల నొప్పులు, వాపుల నుండి ఉపశమనం కలుగుతుంది.
చెడు కొలెస్ట్రాల్ తొలగించి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అలాగే అలసట, నీరసం లేకుండా ఉషారుగా ఉండేలా చేస్తుంది. శరీరంలో వేడి ఉండేలా చేస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది.
ఖర్జూరంలోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండుట వలన చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే కణాల నష్టాన్ని కూడా నయం చేస్తుంది.


