Fenugreek Seeds during pregnancy: గర్భధారణ సమయంలో తీసుకోవలసిన ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మనలో చాలామందికి ఏ ఆహారం తీసుకోవాలి... ఏ ఆహారం తీసుకోకూడదు... అనే విషయంలో ఎన్నో సందేహాలు ఉంటాయి.
గర్భధారణ సమయంలో మెంతులు తీసుకోవచ్చా లేదా అనే విషయానికి వస్తే మెంతులు నార్మల్ గా తీసుకుంటే ఎటువంటి ప్రమాదం ఉండదు. అధిక మొత్తంలో తీసుకుంటే గర్భస్రావానికి దారి తీసే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.
గర్భధారణ సమయంలో మెంతులను ఎక్కువగా తీసుకుంటే శరీరం యొక్క హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. దీని కారణంగా థైరాయిడ్ తో సహా ఎన్నో రకాల సమస్యలు వస్తాయి .అలాగే వాంతులు, వికారం వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది.
అంతేకాకుండా కడుపుబ్బరం అతిసారం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.మెంతులు ఎక్కువగా తీసుకోవడం వలన శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు, గురక వంటి సమస్యలు వస్తాయి. అలాగే ఆ సమయంలో తీసుకునే మందుల ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది.
అందువల్ల అవసరం అయితే తప్పనిసరి పరిస్థితుల్లో వైద్యుల్ని సంప్రదించి తక్కువ మోతాదులో మెంతులను తీసుకోండి. మెంతులు ఎక్కువగా తీసుకుంటే సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగానే ఉంటుంది.


