Sabja Seeds Benefits:వేసవి కాలం ప్రారంభం అయింది. ఈ వేసవిలో మన శరీరానికి తగినంత నీరు అందకపోతే డీహైడ్రేషన్ కి గురవుతుంది. ఎండాకాలంలో శరీరంలో వేడిని తగ్గించడానికి సబ్జా గింజలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి.
సబ్జా గింజలలో ప్రోటీన్స్, ఫైబర్, పిండి పదార్థాలు, కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. ఈ గింజలను నీటిలో నానబెట్టి తీసుకోవాలి. ప్రతిరోజు అర స్పూను గింజలను నీటిలో నానబెట్టి రెండు గంటలు అయ్యాక నానిన సబ్జా గింజలతో సహా ఆ నీటిని తాగాలి.
ఈ విధంగా ప్రతిరోజు తాగుతూ ఉంటే ఎన్నో సమస్యలు తగ్గటానికి సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్న వారిలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. అలాగే అధిక బరువు సమస్యతో బాధపడే వారికి కూడా మంచి ఆహారం అని చెప్పవచ్చు.
ఎందుకంటే సబ్జా గింజలలో ఆల్ఫా లేనోలెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
సబ్జా గింజల్లో ఐరన్, విటమిన్ K సమృద్ధిగా ఉండటం వలన జుట్టు కుదుళ్లు బలంగా ఉండి జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది. కాబట్టి ఈ వేసవిలో కాస్త ఓపికగా సబ్జా గింజలను తీసుకుంటే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.