వేసవికాలంలో నిమ్మకాయలను ఎక్కువగా వాడుతూ ఉంటాం. నిమ్మరసం తీశాక నిమ్మ తొక్కలను పా డేస్తూ ఉంటాం. కానీ ఆ తొక్కలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నిమ్మరసంలో కన్నా నిమ్మ తొక్కలలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.
ఫ్లవనాయిడ్స్ కూడా సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తొలగించడానికి, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచడానికి నిమ్మ తొక్కల పొడి బాగా సహాయపడుతుంది.
నిమ్మ తొక్కలో ఉండే యంటి ఆక్సిడెంట్స్ శరీరంలో తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచి క్యాన్సర్ కారక కణాలను నాశనం చేస్తాయి. అలాగే శరీరంలో విషాలను బయటకు పంపుతాయి. నిమ్మతొక్కలో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచి డయాబెటిస్ నియంత్రణలో ఉండటానికి సహాయపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.


