Saggubiyyam vadalu:సగ్గుబియ్యంతో తక్కువనూనెతో ఇలా టెస్టీ వడలు చేస్కోండి

క్రిస్పీగా, టేస్టీగా ,క్రంచీగా సగ్గుబియ్యం, బంగాళాదుంపల వల్ల టేస్టీగా పల్లీల నట్స్ వల్ల crunchy గా చాలా బాగుంటాయి. ఈ విధంగా చేసి చూడండి.

కావలసినవి:
1 కప్పు లావు సగ్గుబియ్యం, అర కప్పు వేరుశెనగ పల్లీలు, రెండు మీడియం సైజు బంగాళాదుంపలు, నాలుగు పచ్చిమిర్చి, ఒక టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మిరియాల పొడి, కొత్తిమీర.

చేసే విధానం:
సగ్గుబియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్ళని వంచి ఒక కప్పు సగ్గుబియ్యం కి ఒక కప్పు నీళ్లు తీసుకుని రెండు గంటల పాటు నాన నివ్వాలి. సగ్గుబియ్యం సాఫ్ట్ గా చూసుకొని వాటర్ ని జల్లి గిన్నెలో drain చేసేయండి. ఈలోగా బాండీలో పల్లీలు తీసుకొని వేయించుకోండి. వేగిన తర్వాత, చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.

కొంచెం పలుకులుగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి .వీటిని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బంగాళదుంపలు పెద్ద ముక్కలుగా చేసి కుక్కర్ లో ఉడికించుకొని, చల్లారిన తర్వాత తురుముకోవాలి. సన్నగా తురుముకోవాలి లేదా బాగా చేతితో స్మాష్ చేసుకోవాలి.

అందులో నానిన సగ్గుబియ్యం వేసుకోవాలి. అలాగే జార్లో ఉన్న పల్లి పౌడర్ ని కూడా ఈ మిశ్రమంలో వేయండి. పచ్చిమిర్చి కూడా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, ఒక టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం అంతా బాగా మెత్తగా కలుపుకోండి. నీళ్లు పోయినవసరం లేదు.

బంగాళాదుంపలతో ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి నూనె greece చేసుకొని చిన్నచిన్న ముద్దలు తీసుకొని వడలాగా ఒత్తుకోవచ్చు లేదా రౌండ్ గా కూడా చేసుకోవచ్చు. వడలాగా చేసుకుంటే ఒక పాన్ లో ఆయిల్ వేసుకొని లైట్ గా వేసుకొని ఆ పాన్ కి సరిపడా పక్కపక్కన వడలు పెట్టుకొని కొంచెం తిప్పడానికి ఖాళీ చూసుకుని, మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఉంచుకోండి. డీప్ ఫ్రై కాదు.

ఇప్పుడు గుంట పొంగనాలు వేసే మూకుడులో ఆయిల్ కొద్దిగా వేసి ఈ రౌండ్ గా ఉన్న సగ్గుబియ్యం balls వాటిలో పెట్టి మూత పెట్టుకోండి. లో ఫ్లేమ్ లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు మూత తీసి చూడండి లైట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వస్తాయి. కాబట్టి వాటిని రెండోవైపు కూడా కాలనీవ్వాలి .నెమ్మదిగా రెండోవైపుకి తిప్పి మూత తీసి కొంచెం సేపు ఉంచండి.

అలాగే గుంతపొంగనాల్లో కూడా మూత తీసి చూడండి. అవి కొంచెం పొంగినట్టు వచ్చి బ్రౌన్ కలర్ లో వస్తాయి. వాటిని కూడా రెండవ వైపుకి తిప్పుకోండి వేడివేడిగా కచేప్ తో ఆఫర్ చేస్తే ఒకటికి నాలుగు అయిదు తినేస్తారు. చాలా బాగుంటాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top