Masala Challa mirapakayalu: రొటీన్ గా ఉండే మజ్జిగ మిరపకాయలు కాకుండా మసాలా మిరపకాయలు ఎలాగో చూద్దాం. మజ్జిగ లో కాకుండా మసాలా పెట్టి ఈ పచ్చిమిర్చిని ఎండబెట్టుకోవాలి. సింపుల్ కానీ టేస్ట్ చాలా సూపర్ గా ఉంటుంది . మజ్జిగలో వేసి తీసే పని లేకుండా ఈజీగా పెట్టుకోవచ్చు
కావలసినవి:
ఒక కేజీ పచ్చిమిరపకాయలు, మూడు గుంట గరిటల ధనియాలు, రెండు స్పూన్ల మెంతులు - 6 స్పూన్ల జీలకర్ర, ఒక పావు గ్లాసు మరమరాలు,ఒక పెద్ద నిమ్మకాయ,ఇంగువ, కావలసినంత పెరుగు.
చేసే విధానం
ఒక కేజీ పచ్చిమిరపకాయలు పొడవుగా ఉన్నవి మీకు నచ్చినవి తీసుకోవచ్చు. వాటిని శుభ్రంగా కడిగి వాటిని ఒక చాకు తీసుకొని సన్నగా పొడుగ్గా ఘాటు పెట్టుకోవాలి, స్టఫ్ పెట్టుకునేందుకు వీలుగా ఒక్కసారి లోతుగా గింజలు తీయని అవసరం లేదు , బారుగా స్టఫ్ పట్టే వీలుగా గాటుపెట్టి విడదీసి పెట్టుకోవాలి. నీళ్లలో ఒక అరగంట వేసి ఉంచుకోవాలి.
అప్పుడు వాటికవి ఉబ్బినట్టుగా విడిపోతాయి. అంతలో దీనికి కావలసిన మసాలాని తయారు చేసుకుందాం. మసాలా కావలసినవి ముందుగా స్టవ్ వెలిగించుకొని, మూకుడు పెట్టుకొని మూడు గుంట గరిటల ధనియాలు నూనె లేకుండా వేసి చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఎక్కువగా మీడియం నుంచి లో ఫ్లేమ్ లోకి light గా వేయించుకోవాలి.
ధనియాలు అయిపోయిన తర్వాత రెండు స్పూన్ల మెంతులు వేసి అవి కూడా అలాగే లైట్ గా వేగనివ్వాలి. చేదు ఇష్టపడని వాళ్ళు అయితే ఒక స్పూన్ వేసుకోవచ్చు. అది ఇష్టం లేకపోతే పూర్తిగా వదిలేయవచ్చు.
తర్వాత ఐదారు స్పూన్ల జీలకర్ర వేసి వాటిని కూడా లైట్ గా వేపుకోవాలి. ఏది కూడా బాగా వేగకూడదు. లైట్ గానే ఉండాలి. చల్లారిన తర్వాత వాటిని మిక్సీ వేసి బాగా మెత్తగా పొడి చేసుకోవాలి. దీంతోపాటు ఒక పావు గ్లాసు మరమరాలు మెత్తగా పొడి చేసుకోవాలి.
ఇప్పుడు ధనియాలు, జీలకర్ర ,మెంతులు పొడి, మరమరాలు పొడి, ఒక రెండు స్పూన్లు ఉప్పు ,ఒక అర టీ స్పూన్ ఇంగువ పొడి, పావు టీ స్పూన్ పసుపు, బాగా కలుపుకుంటూ ఒక పెద్ద నిమ్మకాయ తీసుకొని రసం పిండేయాలి. అందులో చిన్నవైతే రెండు నిమ్మకాయలు లేదా పెద్దది ఒక కాయ తీసుకోవాలి రసం బాగా ఉండేలాగా చూసుకోవాలి.
తర్వాత పెరుగు తీసుకొని ఆ మిశ్రమానికి ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలి. రోటి పచ్చడి consistency లాగా రావాలి. పెరుగు కొంచెం వేసుకుంటూ కలుపుతూ ఉంటే ఆ ముద్ద గట్టిపడుతూ ఉంటుంది. మళ్ళీ కొంచెం వేసుకుంటూ ఉండాలి .అది మరమరాలు పొడి వేస్తాం కాబట్టి ఎక్కువగా పీల్చుకుంటుంది .
water లో నుంచి పచ్చిమిరపకాయలు బయటకు తీసుకొని నీళ్లు విదిలించుకుని ఈ masala stuff బాగా పైనుంచి కింద వరకు ఎంత మనం గాటు పెట్టామో...ఆ బాగంలో బాగా నొక్కీ పెట్టి పెట్టుకోవాలి. లోపలికి వెళ్లేలా పెట్టాలి. స్టఫ్ పెట్టిన తర్వాత అన్నిటిని ఒక పళ్లెంలో పెట్టుకొని బాగా ఎండబెట్టాలి. అయిదారు రోజులకి మన చల్ల మిరపకాయలు ఎండిపోయినట్టు గలగల ఎండిపోతాయి. అవి కూడా క్రిస్పీగా ఉంటాయి.
ఈ మిరపకాయలు నూనెలో వేపినప్పుడు మనకి ధనియాలు జీలకర్ర ఫ్లేవర్ మెంతులు చేదు పులుపు నిమ్మకాయి పెరుగు పులుపు అన్ని taste లు తెలుస్తాయి .అందుకే వాటిని మసాల మిరపకాయలు అని అంటారు. పప్పులో ,విడిగా కూడా ఉత్తి అన్నంలో కూడా నెయ్యి వేసి నంచుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి.