Mirchi Bajji :నోరూరించే మిర్చి బజ్జి పేరు వినగానే నోరూరిపోతుంది .బజ్జి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అయితే street style బజ్జీని ఇష్టపడతాం. అది మన ఇంట్లో మనం చేసుకుని తింటే ఆహా అనిపిస్తుంది. మిర్చి బజ్జిని క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం.
క్రంచిగా, కారంగా కళ్ళల్లో నీళ్లు వస్తూ రానట్లుగా ఈ స్టైల్ లో చేసుకుంటే సూపర్, ఎంత ఇష్టమున్న మిర్చి బజ్జి తినాలంటే అమ్మో కారంగా ఉంటుందేమో అని భయం ఉంటుంది. కానీ మన స్టైల్లో చేసుకుంటే ఒక్కటి బదులు నాలుగైదు తింటాం.
కావలసినవి:
ముప్పావు కప్పు శెనగపిండి, రెండు టేబుల్ స్పూన్ల బియ్యప్పిండి, పావు చెంచా సోడా, రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ నూనె, పది పన్నెండు మిర్చి బజ్జి. డీప్ ఫ్రై కి సరిపడా నూనె, రెండు స్పూన్లు పేస్ట్ వచ్చేలాగా చింతపండు , ఒక టీ స్పూన్ జీలకర్ర.
చేసే విధానం:
ముప్పావు కప్పు శెనగపిండి, రెండు టేబుల్ స్పూన్ల బియ్యప్పిండి చక్కగా జల్లించి తీసుకోండి. రెండిటిని జల్లించడం వల్ల బజ్జీలు క్రిస్పీగా వస్తాయి. అందులో కారం, ఉప్పు ,వంట సోడా, నూనె వేసి బాగా కలపడం వల్ల మంచి texture కనిపిస్తుంది. ఇందులో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ దోశ పిండి కంటే కొంచెం జారుగా ఉండే consistency చూసుకోండి .
ఇప్పుడు 10 నుంచి 12 బజ్జీలు తీసుకొని వాటిని మధ్యలోకి గాటు పెట్టి మధ్యలో ఉన్న గింజల్ని తీసేయండి. మిరపకాయల్లో stuff చేయడానికి మూడు స్పూన్ల చింతపండు పేస్ట్, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. వాము వాసన వస్తుంది కాబట్టి జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది.
ఇప్పుడు పచ్చిమిర్చి లో చక్కగా ఈ స్టఫ్ ని పెట్టుకోవడం వల్ల పుల్లపుల్లగా, కారం కారంగా ఉంటాయి. మీడియం ఫ్లేమ్ లో 30 సెకండ్లు వేగాక కొంచెం హై లో పెట్టుకొని వేయించు కొని టిష్యూ పేపర్ మీద పెట్టుకోండి.
మూత అసలు పెట్టకూడదు చాలాసేపటి వరకు క్రిస్పీ గానే ఉంటాయి. కరకరలాడుతూ ఉంటాయి. ఆలస్యం ఎందుకు మీరు కూడా యమ్మీ యమ్మీ మిర్చి బజ్జి ని రెడీ చేసుకోండి. స్నాక్స్ లాగా ఈవెనింగ్ టైం లో ఎవరైనా వచ్చినప్పుడు స్పెషల్ రెసిపీ లాగాను సూపర్ గా ఉంటాయి.