Onion Samosa :రైల్వే ఉల్లిసమోసా ఈ టిప్స్ తో కొలతలతో చేసారంటే క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి

అబ్బా సమోసా అనగానే నోరూరిపోతుంది. కానీ స్ట్రీట్ ఫుడ్ కాబట్టి ఎక్కడ తినాలన్నా ఆయిల్ ఎలా ఉంటుందో అని ఒక భయం. అదే మనం ఇంట్లో చేస్తే problem ఉండదు. చక్కగా క్రిస్పీగా టేస్టీగా ఉల్లి సమోసాని ప్రిపేర్ చేసుకుందాం.

కావలసినవి:
మైదాపిండి ,ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తురుము, ధనియాల పౌడర్, జీరా పౌడర్ ,కారం ,ఉప్పు, పసుపు ,కొత్తిమీర తురుము, ఆయిల్.

చేసే విధానం:
ఒక వెడల్పాటి పళ్లెంలో ఒకటిన్నర కప్పు మైదా లేదా సగం మైదా సగం గోధుమపిండి కూడా తీసుకోవచ్చు. ఒక టీ స్పూన్ ఉప్పు వేసి పిండి అంతా పొడిగా కలుపుకోవాలి. తర్వాత రెండు స్పూన్ల వేడి ఆయిల్ వేసి పిండినంతటిని కలపండి. ఒక్కసారి చేతితో మొత్తం అంతా కలిపి పెట్టుకోండి .

ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ తో పిండిని చపాతీ పిండిలా అటు మరీ గట్టిగా ఉండకూడదు మరీ సాఫ్ట్ గా ఉండకుండా కలుపుకోవాలి. పిండి ఆరిపోకుండా ఒక పావు స్పూను ఆయిల్ వేసి మొత్తం అంతటికి పట్టించి మూత పెట్టి ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోండి.

ఒక బౌల్ తీసుకొని, ఒకటిన్నర కప్పు ఉల్లిపాయ తురుము సన్నగా పొడుగ్గా చేసుకోవాలి. అరకప్పు అటుకులు సన్న వైన లావైన పరవాలేదు. ఒక స్పూన్ పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. అర టీ స్పూన్ ధనియాలపొడి వేసుకోవాలి. పావు స్పూన్ జీలకర్ర పొడి ఇష్టమైతే కొంచెం గరం మసాలా, అర స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, సన్నగా తురిమిన కొత్తిమీర కూడా వేసి బాగా గట్టిగా ఉల్లిపాయల్లో ఉన్న నీరుతో బాగా మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి.

ఒక చిట్కా ఏమిటంటే అటుకులు ఉండడం వల్ల ఉల్లిపాయలు వాటర్ ని observe చేస్తాయి. లేదు అటుకులు ఇష్టం లేకపోతే ఉల్లిపాయల్ని కాసేపు ఆరబెట్టుకొని కలపాలి. లేదు అంటే సమోసా మెత్తబడిపోతుంది. ఈ స్టఫింగ్ పక్కన పెట్టేసుకోండి .

ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో రెండు స్పూన్ల మైదా వేసుకొని వాటర్ తో ఉండలు లేకుండా కొంచెం జారుగా కలుపుకోవాలి. కొంచెం చిక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు నానిన పిండిని తీసుకొని బాగా ఇంకోసారి మెత్తగా నలపాలి. ఎక్కువగా నలపడటం వల్ల సమోసా ఫోల్డ్ చేసినప్పుడు విడిపోకుండా ఉంటుంది. ఈ పిండి సుమారు ఒక ఆరు ముద్దలు వస్తాయి .

ఒక పిండి ముద్ద తీసుకొని బాగా పల్చగా రోల్ చేసుకోవాలి. వీలైనంత పల్చగా రోల్ చేసుకోండి. చేతి మీద వేసుకుంటే మన వేళ్ళు కనిపిస్తాయి అంత పల్చగా చేసుకొని ఒక పాన్ వేడి చేసి ఆ పాన్ మీద చపాతీని వేసి చాలా లైట్ గా కాల్చుకోవాలి. జస్ట్ అది స్టిక్కీ అవకుండా చూసుకుంటే సరిపోతుంది. అలా తిప్పుకుంటూ కాల్చుకోండి.

ఇప్పుడు ఒక చపాతీ తీసుకొని పొడవు 16 సెంటీమీటర్స్, వెడల్పు 15 సెంటీమీటర్ల కింద ఒక చపాతీని కట్ చేసుకోండి. అంటే నిలువుగా అడ్డంగా అప్పుడు మనకి పీస్ కరెక్ట్ గా వస్తుంది. అది చూసుకున్నాక అన్ని అదే కొలతతో కట్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు స్కేల్ పెట్టి చాకు తీసుకుని కట్ చేసుకుంటాం కదా, కట్ చేసిన పార్ట్స్ extras పక్కకు తీసేయండి.

ఇప్పుడు అది ఒక square పీస్ లాగా వస్తుంది. మళ్ళీ దానిని మూడు భాగాలుగా కట్ చేసుకోవాలి . ఇప్పుడు length 16 cms వస్తది. WIdth 5 cms వస్తుంది. ఇలా మనం వచ్చిన ఆరు చపాతీలకి ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకోవడం వల్ల , ఆరు మూళ్ళు 18 సమోసాలు వస్తాయి. ఈ పొడిగాటి ముక్కల్ని ఆరిపోకుండా ఒక డిష్ లో పెట్టి మూత పెట్టి ఉంచుకోవాలి.

ఇప్పుడు ఒక పీస్ తీసుకొని ఒక కోన్ షేప్ లో ఫోల్డింగ్ వేసుకోవాలి. అది మైదాpaste ఉంది కదా పూసుకుంటూ తడుపుకుంటూ ఉంటే అది అతుక్కుంటుంది. ఒక మడత వేసిన తర్వాత L shape లో మళ్లీ మైదా పూసి మళ్ళీ మడత వేస్తే మీకు కోన్ షేప్ వస్తుంది. 

ఆ కోన్ షేప్ లో మనం స్టఫ్ చేసుకున్నది పెట్టుకొని extra ఉన్న ముక్కని మడి చేసేది. అప్పుడు మనకి సమోసా మోడల్ లోకి వచ్చేస్తుంది ఎక్కడైనా గ్యాప్ ఉంటే మైదా పూసేయండి.

ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పోసి బాగా కాననివ్వాలి. మీడియం ఫ్లేమ్ లో సమోసాలను వేయించుకోవాలి. బాగా నూనె కాగాక వేసేటప్పుడు low flame లో పెట్టుకోవాలి .లో టు మీడియం ఫ్లేమ్ లోనే గోల్డెన్ కలర్ వచ్చేవరకు సమోసాలను తిప్పుకుంటూ వేగించుకుంటే చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top