ఈ మధ్యకాలంలో జుట్టుకు సరైన పోషణ లేకపోవడం వలన చుండ్రు వంటి సమస్యలు వస్తున్నాయి. చుండ్రు ఒకసారి వచ్చిందంటే అంత తొందరగా తగ్గదు. చుండ్రు సమస్య రాగానే మనలో చాలా మంది మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు.
అలాకాకుండా మన ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చుండ్రు సమస్యను తగ్గించుకోవచ్చు. ఇప్పుడు చెప్పే చిట్కా పాటిస్తే చుండ్రు సమస్య తగ్గటమే కాకుండా జుట్టు రాలే సమస్య కూడా తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది .జుట్టు రాలడానికి చుండ్రు కూడా ఒక కారణం అని చెప్పవచ్చు.
మిక్సీ జార్ లో ఒక స్పూన్ అవిసె గింజలు, ఒక స్పూన్ మెంతులు, 10 వేపాకులు, 2 రెబ్బల కరివేపాకు వేసి మెత్తని పేస్ట్ గా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత పోయి వెలిగించి గిన్నెపెట్టి ఒకటిన్నర గ్లాసుల నీటిని పోసి నీరు వేడి అయ్యాక మిక్సీ చేసుకున్న మిశ్రమం వేయాలి. ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం ముక్కలు వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని పల్చని వస్త్రం సాయంతో వడగట్టాలి. ఈ మిశ్రమంను జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు బాగా పట్టించి గంట అయ్యాక కుంకుడుకాయలతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే చుండ్రు సమస్య నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు.


