Joint Pains:ఎముకల బలానికి తీసుకోవలసిన జాగ్రత్తలు

Joint Pains In Telugu :చాలా మందికి చిన్న వయస్సులోనే ఎముకలు గుల్లబారి రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆహారం మీద దృష్టి పెట్టాలి. 

తరచూ మాంసం, చేపలు,ఆకుపచ్చని కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో జింక్,మాంగనీస్ ప్రోటీన్ అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృడంగా ఉంచుతాయి. అందుకే ఎదిగే పిల్లలు వీటిని ఎక్కువగా తినేలా ప్రొత్సహించాలి. 

అలాగే విటమిన్ 'కె' శరీరానికి అందటం వలన రక్తం త్వరగా గడ్డకట్టటమే కాకుండా ఎముకలు గట్టిపడతాయి. విటమిన్ 'కె' ముఖ్యంగా కుర అరటి, పాలకూర, బ్రాకోలి లో బాగా దొరుకుతుంది.

మోనోపాజ్ దశలో మహిళలు బలహినపడతారు. కొందరికి ఏ చిన్న దెబ్బ తగిలినా ఎముకలు త్వరగా విరిగిపోతూ ఉంటాయి. అలాంటి వారు ప్రోటిన్స్ ఎక్కువగా లభించే బంగాళదుంప,చిలకడ దుంప,అరటిపండ్లు, పెరుగు వంటి తరచూ తీసుకోవటం మంచిది. 

రోజుకో గ్లాస్ పాలు త్రాగటం వలన శరీరానికి అవసరమైన క్యాల్షియం అందుతుంది. పాలకు బదులుగా సోయా లేదా బాదం పాలు కూడా తీసుకోవచ్చు.

కాఫీ ఎంత మితంగా తీసుకుంటే అంత మంచిది. కెఫీన్ శరీరంలోని క్యాల్షియంను గ్రహించేస్తుంది. దీని వలన ఎముకలు త్వరగా గుల్ల బారతాయి. పీచు ఎక్కువగా లభించే బీరకాయ వంటి కూరగాయలు, అనాస వంటి పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. 

పీచు ఎముకలకు ఎంతగానో మేలు చేస్తుంది. ప్రతి రోజు కొంతసేపు నడవటం, యోగ వంటివి చేయాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top