
Paneer Popcorn Recipe: పనీర్ తో ఎన్నో రకాల వంటలు చేసుకుంటూ ఉంటాం. పనీర్ తో చేసిన ప్రతి వంట చాలా రుచిగా ఉంటుంది. తిన్న కొద్ది తినాలని అనిపిస్తుంది. ఇప్పుడు చెప్పే పనీర్ పాప్ కార్న్ ని చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తింటారు.
కావలసిన పదార్థాలు
250 గ్రాముల పనీర్
వేగించడానికి నూనె
కోటింగ్ కోసం
పావు కప్పు మైదా
రుచికి సరిపడా ఉప్పు
ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్
తగినన్ని నీళ్లు
ఒక కప్పు బ్రెడ్ పొడి
తయారీ విధానం
ముందుగా ఒక బౌల్ లో 1/4 కప్పు మైదా, రుచికి సరిపడా ఉప్పు ,ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసి సరిపడా నీటిని పోసి బాగా కలపాలి. పిండి కాస్త జారుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో పనీర్ ముక్కలను వేసి కోటింగ్ బాగా పట్టించాలి.
ఆ తర్వాత ఒక్కో పనీర్ ముక్కను తీసి బ్రెడ్ పొడిలో బాగా రోల్ చేసి బ్రెడ్ పొడి బాగా పట్టేలాగా చూడాలి. ఇలా అన్ని కోట్ చేసుకున్నాక అరగంటసేపు ఫ్రిజ్ లో పెట్టాలి. అరగంట అయ్యాక వీటిని తీసి నూనెలో మీడియం ఫ్లేమ్ లో ఎర్రగా వేయించుకోవాలి.

