Cracked Heels;ముఖాన్ని చూసుకున్న విధంగా కాళ్లను,చేతులను పట్టించుకోము. దీని కారణంగా చలి కాలంలోమడమల పగుళ్ల సమస్య ఎక్కువగా ఏర్పడుతుంటుంది. దీనికి కారణం సరైన జాగ్రత్త తీసుకోకపోవడం ఒకటైతే, మరొకటి వేడి నీటితో స్నానం చేయడం. ఈ కాలంలో చల్లని గాలుల కారణంగా శరీరంలోని తేమ క్రమంగా తగ్గడం మొదలవుతుంది.
శరీరంలో పోషకాల లోపం వల్ల కూడా మడమల పగుళ్ల సమస్య తలెత్తుతుంది. దీని నుంచి విముక్తి పొందే ఉపాయాలను వెతుక్కోవాలి. అప్పుడు పగిలిపోయిన మీ మడమలకు ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు మీరు ఎవరి ముందు సిగ్గుపడాల్సిన పని ఉండదు.
శతాబ్దాలుగా కర్పూరం నూనె తనదైన లక్షణాలతో ప్రసిద్ధి చెందింది. ఇది మడమల పగుళ్లతో ఏర్పడే మంటను తగ్గిస్తుంది. ఇది రక్త ప్రసరణను మెరుగు పరిచి నొప్పికి ఉపశమనం కలిగిస్తుంది.
బ్లాక్ పెప్పర్ ఆయిల్ కేవలం రుచి పెంచడానికే కాదు, దీన్ని సంవత్సరాలుగా ఔషధాల్లోనూ ఉపయోగిస్తున్నారు. ఇందులో ఫోలిక్ యాసిడ్, కాపర్, క్యాల్షియం, విటమిన్లు, పొటాషియంఎక్కువ మోతాదులో ఉంటాయి. దీనికి మడమ గాయాలను నయం చేసి, నొప్పి నుంచి ఉపశమనం కలిగించే శక్తి కూడా ఉంది.
పెప్పర్మెంట్ ఆయిల్ను కాస్మెటిక్ఉత్పత్తులలో వినియోగిస్తారు. ఇది చర్మాన్ని మృదువుగా, అందంగా తయారు చేస్తుంది. ఇందులో ఉన్న ఒత్తిడి తగ్గించే తత్వం మడమల మంటలకు ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో మడమలను బాగు చేసే సామర్థ్యమున్న మేథోల్ లాంటి మూలకాలు ఉంటాయి.


