MURKULU:స్వీట్ షాప్స్ వాళ్ళు మురుకులు కరకరలడడానికి ఇలా చేస్తారు...మీరు ట్రై చేయండి

MURKULU: క్రిస్పీగా ఉండే మురుకులు ఎంతో ఎట్రాక్టివ్ గా, టేస్టీగా ,స్నాక్స్ రెసిపీ గా పిల్లలకి బాక్స్ లో పెట్టేందుకు, ఎవరైనా వచ్చినప్పుడు ఆఫర్ చేయడానికి టీ బ్రేక్ లో సూపర్ గా ఉంటాయి.

కావలసినవి:
కిలో బియ్యప్పిండి, 50 గ్రాములు మైదా, వేడి నీళ్లు ,నూనె ,ఉప్పు, కారం ,నువ్వు పప్పు ,వాము ,నెయ్యి.

చేయు విధానం:

ఒక పావు లీటర్ నీళ్ళని మరిగించుకోండి మరుగుతున్న water లో సరిపడా సాల్ట్, ఒక టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ నువ్వు పప్పు ,ఒక టీ స్పూన్ వాము ,ఒక ఒక స్పూన్ నెయ్యి, వేసి బాగా కలుపుకోవాలి .పావు కిలో బియ్యం పిండి వేసుకుని ఇంకా కలపాలి. 50 గ్రాముల మైదా వేసి స్టవ్ ఆఫ్ చేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి.

దానిని ఒక బౌల్లోకి దిమ్మరించి బాగా మెత్తగా ఒత్తుకోవాలి . కొంచెం వేడిగా ఉన్నప్పుడే వత్తితేనే ముద్ద వస్తుంది కానీ వేడితో మనం చేయిపట్టలేం కాబట్టి ఒక తడి గుడ్డ తీసుకొని దానితోటే మొత్తం పిండి అంతా ఒక ముద్ద లాగా ఒత్తుకోవాలి. ఒక తడి గుడ్డ తోనే కప్పి ఉంచుకోవాలి .

తేమ ఆరకుండా చూసుకోవాలి. మురుకులు వేసే గుత్తి తీసుకొని లోపల భాగమంతా నూనెతో తడిపి పిండిని కొంచెం కొంచెంగా చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని కారపూస, జంతికలు మార్చుకునేలా ప్లేట్లు ఉంటాయి కదా అలాగే ఇందులో ఒక స్టార్ తో ఉన్న పళ్లెం ని పెట్టుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్ మీద నూనె కాగిన తర్వాత ఆ గుత్తితో జంతిక చక్రం లాగా ఒత్తుకోవాలి.

గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నూనె తేలే వరకు ఉంచి దానిని ఒక్కసారి తిప్పి ఒక టిష్యూ పేపర్ మీద తీసుకోండి. చల్లారేక length wise పీసెస్ గా కట్ చేసుకుంటే మీకు స్వీట్ షాప్ లో మురుకుల వలే చుట్టూ చక్రం లాగా వచ్చి చూడటానికి చాలా అట్రాక్టివ్ గా క్రిస్పీగా ఉంటాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top