మనలో చాలా మంది స్వీట్స్ ని చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే jalebi చేయటం చాలా కష్టం అని అనుకుంటారు. అయితే ఇప్పుడు చెప్పిన విధంగా చేస్తే చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు. అలాగే చాలా రుచిగా ఉంటుంది.
కావలసిన పదార్థాలు:
మైదా: 1 1/2 కప్పు
పెసర పిండి: 2 స్పూన్స్
పంచదార: 3 కప్పులు
వంట సోడా చిటికెడు
నిమ్మరసం: 1 స్పూన్
యాలకుల పొడి : 1/2 స్పూన్
నెయ్యి లేదా నూనె : వేయించడానికి
కేసర్ రంగు : చిటికెడు
తయారు చేయు విధానము:
ఒక బౌల్ తీసుకోని దానిలో మైదా,పెసర పిండి,వంటసోడా,నెయ్యి, నిమ్మరసం, కేసర్ రంగు వేసి నీరు పోస్తూ ఉండలు లేకుండా చిక్కగా కలిపి ఒక రాత్రంతా అలా ఉంచాలి. పిండి బాగా పులిస్తేనే జిలేబి బాగా వస్తుంది. మరునాడు ఉదయం పిండిని ఒకసారి కలిపి అవసరం అనుకుంటే నీరు పోసి గరిటజారుగా కలిపి పెట్టుకోవాలి.
తర్వాత ఒక గిన్నెలో చక్కెర,అరగ్లాస్ నీరు పోసి తీగ పాకం వచ్చే వరకు మరిగించాలి. అందులోనే యాలకులపోడిని కూడా కలిపాలి. ఇప్పుడు జిలేబిని చేయడానికి ఒక మందపాటి గుడ్డను తీసుకోని దానికి చిన్న రంధ్రము చేసి అందులో పిండి వేసి పై భాగంలో చుట్టలాగా పట్టుకొని వేడి నూనెలో జిలేబి చుట్టలుగా చుట్టాలి.
వీటిని కొంచెం దోర రంగులో వేగించి పైన తయారుచేసుకున్న చక్కెర పాకంలో వేసి, 10 నిముషాలు అయిన తర్వాత పాకంలోంచి తీసి వేరే పళ్ళెంలో పెట్టితే వేడి వేడి జిలేబిలు రెడీ.


