Skin Care Tips:వయస్సు మీద పడుతున్నా కొద్ది వృద్దాప్య ఛాయలు కూడా ప్రారంభమవుతాయి. అప్పుడు దీని ప్రభావం చర్మం మీద పడుతుంది. కొన్ని చిట్కాల ద్వారా వయస్సు ప్రభావం నుండి తప్పించుకోవచ్చు.
పచ్చి కొబ్బరిని తురిమి దానిని ఒక శుభ్రమైన బట్టలో వేసి గట్టిగా పిండితే కొన్ని చుక్కల పాలు వస్తాయి. ఆ పాలను ముఖానికి,మెడకి,చేతులకు పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. క్రమం తప్పకుండా కొన్ని రోజుల పాటు ఈ విధంగా చేస్తే వయస్సు ప్రభావం నుండి తప్పించుకోవచ్చు.
ముఖం మీద మచ్చలు,ముడతలు వయస్సు ప్రభావాన్ని మరింత పెంచుతాయి. రాత్రి పడుకొనే ముందు గ్లిజరిన్,రోజ్ వాటర్,నిమ్మరసం సమపాళ్ళల్లో కలిపి ముఖానికి పట్టించి,ఉదయం నిద్ర లేవగానే గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ముఖం మీద ముడతలు,మచ్చలు నివారించటానికి ఇది బాగా పనిచేస్తుంది.
పైనాపిల్ ముక్కలను ముఖం మీద బాగా రుద్ది పావుగంట సేపు ఆరనివ్వాలి. ఇది ముఖం మీద ఏర్పడే ముడతలను,మచ్చలను సమర్దవంతముగా అరికడుతుంది.
పాలలోని లాక్టిక్ యాసిడ్ సమర్దవంతముగా ముడతలను,మచ్చలను ఎదుర్కొంటుంది. ప్రతి రోజు రాత్రి పడుకొనే ముందు కొన్ని చుక్కల పాలను ముఖానికి పట్టించి ఉదయం శుభ్రం చేసుకోవాలి.
ఫేషియల్ మసాజ్ ద్వారా కూడా మంచి పలితాన్ని పొందవచ్చు. నెలలో ఒకటి,రెండు సార్లు ఫేషియల్ మసాజ్ చేయించుకోవటం మంచిదని నిపుణులు చెప్పుతున్నారు.


