Skin Care Tips:యవన్నంగా ఉండాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి.. కొన్ని ఆహారపదార్దాలు వయస్సు తక్కువగా కనిపించేలా చేస్తాయి. అంతేకాకుండాచర్మంను మెరిసేలా చేస్తాయి. వాటిని క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి పలితాన్ని పొందవచ్చు.
పాలకూర
దీనిలో ఉండే విటమిన్ ఎ, బీటా కెరోటిన్ లు వయస్సు ఛాయలు కనపడకుండాచర్మాన్ని కాపాడతాయి. దీనిని ప్రతి రోజు ఆహారంలో తీసుకుంటే నలబైసంవత్సరాల వయస్సులో కూడా చర్మం మెరుస్తూ వయస్సు తక్కువ వారిగా
కనిపిస్తారు.
సబ్జా గింజలు
చర్మ ఆరోగ్యాన్ని రక్షించటంలో సబ్జా గింజలు ముందు ఉంటాయి. ఇందులో ఒమేగా 3 ప్లాటి ఆమ్లాలు సమృద్దిగా ఉంటాయి. ఒక స్పూన్ సబ్జా గింజలను ప్రతి రోజుతీసుకుంటే చర్మం యవ్వనంగా కనపడుతుంది.
టమోటా
ఇందులో ఉండే లైకోపిన్ చర్మానికి మెరుపును ఇస్తుంది. ఇందులో యాంటి ఏజింగ్ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాలుష్యం, హానికరమైన సూర్య కిరణాల నుండి లైకోపిన్ చర్మాన్ని రక్షిస్తుంది.
బాదం
చర్మ సౌందర్యానికి ఎంతగానో అవసరమయ్యే విటమిన్ ఇ, యాంటి ఆక్సి డెంట్స్ బాదంలో సమృద్దిగా ఉంటాయి. ప్రతి రోజు నాలుగు బాదం పప్పులను రాత్రి పూట నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినటం మంచిది.