Gutti Vankaya Curry:గుత్తి వంకాయ కూరని ఇలా చేసుకుంటే తింటూనే ఉండాలనిపిస్తుంది.. వంకాయతో ఏమి చేసుకున్న చాలా రుచిగా ఉంటుంది.
కావలసిన పదార్దాలు
పొడవు వంకాయలు... అర కేజీ
ఎండుమిర్చి... పది
మినప్పప్పు... నాలుగు టీ.
ధనియాలు.... ఒక టీ.
ఉల్లిపాయలు... నాలుగు
వెన్న... వంద గ్రా.
ఉప్పు... తగినంత
నూనె... మూడు టీ.
తయారీ విధానం
వంకాయలను గుత్తి వంకాయ మాదిరిగా మధ్యలోకి కోసుకోవాలి. వాటిని ఉప్పునీటిలో వేయాలి. ఒక బాణలి తీసుకోని పొయ్యి మీద పెట్టి రెండు స్పూన్ల నూనె పోసి కాగాక ఎండుమిర్చి, ధనియాలు, మినపప్పు వేసి దోరగా వేగించాలి. దీన్ని మిక్సీలో వేసి కొంచెం నలిగాక, దానిలో ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తగా చేసుకోవాలి.
దీనిని ఒక గిన్నెలోకి తీసుకోని తగినంత ఉప్పు, వెన్న కలపాలి. ఈ మిశ్రమాన్ని కోసుకున్న అన్ని వంకాయలలో కూరాలి. పొయ్యి మీద ఒక మందపాటి గిన్నె పెట్టి దానిలో తగినంత నూనె పోసి, కాగాక దానిలో వంకాయలను పక్క పక్కన పేర్చి, దాని మీద మూత పెట్టి సన్నని మంట మీద మగ్గనివ్వాలి. అంతే నోరూరుంచే వంకాయ బటర్ మసాలా రెడీ.