Eleven OTT: ఓటీటీకి.. ఎలెవ‌న్ (Eleven).. క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్.. ఎందులో అంటే..

Eleven ott
ఇటీవల థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్‌తో పాటు మంచి విజయాన్ని సాధించిన చిత్రం ‘ఎలెవెన్’ (Eleven). క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జానర్‌లో రూపొందిన ఈ సినిమా మే 16న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. కేవలం 25 రోజుల్లోనే ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. 

నవీన్ చంద్ర కథానాయకుడిగా నటించగా, రేయా హరి, అభిరామి కీలక పాత్రల్లో కనిపించారు. ప్రముఖ దర్శకుడు సుందర్ సీ వద్ద అనేక సినిమాలకు సహాయకుడిగా పనిచేసిన లోకేశ్ అజిల్స్ ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించారు. ఇటీవల వెబ్ సిరీస్‌లలో వరుస హిట్స్‌తో గుర్తింపు పొందిన నవీన్ చంద్ర, థ్రిల్లర్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.

కథ విషయానికొస్తే... విశాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న అరవింద్ (నవీన్ చంద్ర) స్మార్ట్ పోలీస్ అధికారిగా మంచి పేరు తెచ్చుకుంటాడు. నగరంలో జరుగుతున్న వరుస హత్యల కేసును పరిశోధిస్తున్న పోలీస్ అధికారి రంజిత్ (శశాంక్) రోడ్డు ప్రమాదానికి గురవడంతో ఆ కేసు బాధ్యత అరవింద్‌కు అప్పగిస్తారు. 

అయినప్పటికీ హత్యలు కొనసాగుతూనే ఉంటాయి, కానీ హంతకుడి ఆచూకీ లేదా ఆధారాలు ఏమీ దొరకవు. ఆరో హత్య వద్ద ఒక చిన్న క్లూ దొరకడంతో కేసులో కొంత కదలిక వస్తుంది. హత్యలకు గురైన వారి ఆచూకీ క్రమంగా బయటపడుతుంది, కానీ హంతకుడు ఎవరనేది మాత్రం మిస్టరీగానే మిగిలిపోతుంది.

చివరకు అరవింద్ ఆ హంతకుడిని పట్టుకున్నాడా? ఈ దారుణ హత్యల వెనుక కారణం ఏమిటి? ట్విన్ బర్డ్ స్కూల్, ఆరుగురు కవలలకు ఈ హత్యలతో సంబంధం ఏంటి? బెంజిమన్ పాల్, ఫ్రాన్సిస్ ఎవరు? అనేది కథ యొక్క సారాంశం. 

సినిమా ఆరంభమైన 10 నిమిషాల్లోనే ఇన్వెస్టిగేషన్ మొదలై, ఆద్యంతం సస్పెన్స్‌తో ప్రేక్షకులను కట్టికడుతుంది. సీరియల్ కిల్లర్ కథతో పాటు కొన్ని భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను కదిలిస్తాయి. ప్రీ-ఇంటర్వెల్‌లో కిల్లర్ బయటపడినప్పటికీ, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది.

ఈ సినిమా జూన్ 13 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో మిస్ అయినవారు, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారు ఈ ‘ఎలెవెన్’ చిత్రాన్ని తప్పక చూసి ఆనందించవచ్చు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top