DDNextLevel: ఓటీటీలోకి హారర్‌ కామెడీ..ఎప్పుడో తెలుసా..

DDnextlevel movie
సంతానం ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘DDNextLevel’. ఈ సినిమాలో సెల్వ రాఘవన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, గీతికా తివారి తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

ఎస్. ప్రేమ్ ఆనంద్ రచన, దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మే 16న విడుదలై, హర్రర్ కామెడీ శైలితో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా ఇప్పుడు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో జూన్ 13 నుంచి జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

కథాంశం    

కృష్ణమూర్తి (సంతానం) ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ, సినిమాలకు నిజాయతీగల రివ్యూలు ఇస్తూ ప్రేక్షకుల ప్రశంసలు పొందుతాడు. ఒక రోజు ‘డీడీ నెక్స్ట్ లెవెల్’ అనే సినిమా స్క్రీనింగ్‌కు ఆహ్వానం అందుతుంది. కుటుంబంతో కలిసి సినిమా చూసేందుకు వెళ్లిన అతనికి, ఆ థియేటర్ దెయ్యాల థియేటర్ అని తెలుస్తుంది.

అక్కడికి వెళ్ళినవారు బయటకు రావడం అసాధ్యమని తెలుసుకుంటాడు. తాను గతంలో రివ్యూ ఇచ్చిన ఓ సినిమా నిర్మాత, పగతీర్చుకోవడానికి ఈ పథకం వేశాడని అర్థమవుతుంది. దీంతో కృష్ణమూర్తి ఆ థియేటర్ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తాడు. అతను ఎలా బయటపడ్డాడు? అసలు థియేటర్‌లో దెయ్యాలు ఉన్నాయా? అనేది కథ.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top