కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే మన కళ్ళు అమూల్యమైనవి. అయితే, నీటి రోజుల్లో చాలా మంది ఎక్కువ సమయం స్క్రీన్‌ల ముందు గడుపుతున్నారు, దీంతో కళ్లపై ఒత్తిడి పెరుగుతోంది. సరైన ఆహారం మరియు కొన్ని జాగ్రత్తలతో మనం కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. స్క్రీన్ సమయాన్ని తగ్గించి, ఈ సూపర్ ఫుడ్స్‌తో మీ కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోండి:
క్యారెట్లు
క్యారెట్లు కంటి ఆరోగ్యానికి అద్భుతం. వీటిలో ఉండే బీటా-కెరోటిన్ శరీరంలో విటమిన్ Aగా మారుతుంది, ఇది రాత్రి దృష్టికి మరియు మొత్తం కంటి ఆరోగ్యానికి అవసరం. క్యారెట్లను పచ్చిగా తినవచ్చు, జ్యూస్‌గా తాగవచు లేదా కూరలో వేసుకోవచ్చు.
పాలకూర, ఆకు కూరలు
పాలకూర, తోటకూర, ముల్లంగికూర వంటి ఆకు కూరలు లుటీన్ మరియు జియాక్సాంతిన్‌లను కలిగి ఉంటాయి. ఇవి కళ్లను హానికరమైన బ్లూ లైట్ మరియు UV కిరణాల నుండి రక్షిస్తాయి, వయస్సుతో వచ్చే మాక్యులర్ డీజెనరేషన్, కంటిశుక్లం వంటి సమస్యలను నివారిస్తాయి.
సిట్రస్ పండ్లు
నారింజ, ముసంబి, నిమ్మ, ద్రాక్ష వంటి పండ్లలో విటమిన్ C బాగా ఉంటుంది. ఈ యాంటీఆక్సిడెంట్ కళ్లలోని రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచి, కంటిశుక్లం వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది.
గుడ్లు
గుడ్లు, ముఖ్యంగా పచ్చసొన, కళ్లకు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ A, లుటీన్, జియాక్సాంతిన్, జింక్ ఉంటాయి, ఇవి మాక్యులర్ డీజెనరేషన్, కంటిశుక్లం వంటి సమస్యల నుండి కళ్లను కాపాడతాయి.
బాదం, పిస్తా గింజలు
బాదం, పిస్తా వంటి గింజలలో విటమిన్ E ఉంటుంది, ఇది కంటి కణాలను నష్టం నుండి రక్షిస్తుంది మరియు వయస్సుతో వచ్చే కంటి సమస్యలను నిదానిస్తుంది. రోజూ ఒక గుప్పెడు గింజలు తింటే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే, కళ్లకు విశ్రాంతి ఇవ్వడం మర్చిపోవద్దు. ప్రతి 20 నిమిషాలకు 20 అడుగుల దూరంలో 20 సెకన్లు చూస్తూ కళ్లకు విరామం ఇవ్వండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.