కావలసిన పదార్థాలు:
- 1/2 కప్పు అటుకులు
- 1/4 కప్పు పుట్నాల పప్పు
- 1 కప్పు బియ్యప్పిండి
- 1 టీస్పూన్ నెయ్యి లేదా నూనె
- 1 కప్పు నీరు
- 1 టీస్పూన్ కారం
- రుచికి సరిపడా ఉప్పు
- 1/2 టీస్పూన్ వాము
- 1 టీస్పూన్ నువ్వులు
- 1/4 టీస్పూన్ ఇంగువ
తయారీ విధానం:
1. 1/2 కప్పు అటుకులు, 1/2 కప్పు పుట్నాల పప్పును చిన్న మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గిడి, పొడిగా చేయండి.
2. ఒక గిన్నెలో ఈ పొడిని జల్లించి, 1 కప్పు బియ్యప్పిండి కలిపి, మూడింటినీ బాగా మిక్స్ చేయండి.
3. ఒక బాండీలో ఈ మిశ్రమాన్ని నూనె లేదా నెయ్యి వేయకుండా మీడియం మంటపై, కమ్మని వాసన వచ్చే వరకు లైట్‌గా వేయించండి.
4. ఉప్పు, కారం, నువ్వులు, వాము, ఇంగువ వేసి, పొడి పొడిగా కలిపి పక్కన పెట్టండి.
5. బియ్యప్పిండి కొలిచిన కప్పుతోనే 1 కప్పు నీటిని మరిగించండి. మరుగుతున్న నీటిని ఈ మిశ్రమంలో వేసి, ముందుగా చెంచాతో కలపండి.
6. రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచి, చల్లారిన తర్వాత చేత్తో మెత్తగా, సెమీ సాఫ్ట్‌గా ముద్దలా కలపండి. (మరీ మెత్తగా లేదా గట్టిగా ఉండకూడదు).
7. మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని, రోల్‌లా చేసి, కావలసిన సైజులో రింగ్ ఆకారంలో తయారు చేయండి.
8. ఒక బాండీలో సరిపడా నూనె వేసి, మీడియం మంటపై వేడి చేయండి. రింగ్‌లను వేసి, రెండు నిమిషాలు వేగిన తర్వాత తిప్పుతూ బంగారు రంగు వచ్చే వరకు వేయించండి.
9. కరకరలాడే, రుచికరమైన చెక్కోడీలు సిద్ధం!