కేరళ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేవి పచ్చటి కొబ్బరి తోటలు, బ్యాక్‌వాటర్స్, మసాలా దినుసులు. అయితే, కేరళలోని అనేక వంటకాలు కూడా చాలా ప్రసిద్ధం. కేరళ సంప్రదాయ స్నాక్స్‌లో ముఖ్యమైనవి బనానా చిప్స్.
ఇవి రుచిలోనే కాక, పోషక విలువల్లో కూడా అగ్రస్థానంలో ఉంటాయి. సాధారణంగా నెంధ్రన్ అరటికాయలతో తయారయ్యే ఈ చిప్స్‌ను టీ టైమ్ స్నాక్‌గా చాలా మంది ఇష్టపడతారు. ఇంట్లోనే ఈ చిప్స్‌ను సులభంగా, ఆరోగ్యకరంగా ఎలా తయారు చేయవచ్చో చూద్దాం.
కావలసిన పదార్థాలు:
- 4-5 పచ్చి అరటికాయలు (Raw Bananas, preferably Nendran variety)
- 1/4 tsp పసుపు (Turmeric Powder)
- కొబ్బరి నూనె (Coconut Oil) - వేయించడానికి
- రుచికి తగినంత ఉప్పు (Salt)
- 1 tsp మిరపకాయ పొడి (Chili Powder, optional for spicy flavor)
తయారీ విధానం:
పచ్చి అరటికాయలు తొక్క తీసి నీటిలో వేసి సేపు ఉంచండి (ఇది నల్లబడం నివారిస్తుంది). అరటికాయలను సన్నగా గుండ్రంగా కోయాలి. (మందం ఒకేలా ఉండాలి, సన్నగా కోస్తే క్రిస్పీగా వస్తాయి).
కోసిన తర్వాత వెంటనే పసుపు కలిపిన నీటిలో 5 నిమిషాలు నానబెట్టండి.కొబ్బరి నూనెను ఒక గిన్నెలో వేడి చేయండి (మీడియం-హై ఫ్లేమ్).నీటిలో నానిన అరటి ముక్కలను తీసి, ఒక గుడ్డపై ఆరబెట్టి తేమ తొలగించండి.
వేడి నూనెలో ముక్కలను జాగ్రత్తగా వేసి, బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. ఒకేసారి ఎక్కువ వేయకండి, కలిసిపోతాయి.
వేయించిన చిప్స్‌ను కాగితంపై వేసి అదనపు నూనె పీల్చుకోనివ్వండి.వెంటనే ఉప్పు, మిరపకాయ పొడి (ఐచ్ఛికం) చల్లి బాగా కలపండి.
చిప్స్ చల్లారిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయండి. ఇవి 1-2 వారాలు తాజాగా ఉంటాయి.
చిట్కాలు:
- నెంద్రం అరటికాయలు ఉపయోగిస్తే అసలైన కేరళ రుచి వస్తుంది.
- నూనె బాగా వేడెక్కకపోతే చిప్స్ నూనె ఎక్కువగా పీల్చుకుంటాయి.
- సన్నగా కోయడానికి మాండొలిన్ స్లైసర్ ఉపయోగించవచ్చు.
ఈ కేరళ స్టైల్ బనానా చిప్స్ క్రిస్పీగా, రుచిగా ఉంటాయి. సాయంత్రం టీతో లేదా స్నాక్‌గా ఆస్వాదించండి!