ఈ రోజు సింపుల్‌గా, రుచికరమైన మిరియాల చారు రెసిపీ తెలుసుకుందాం. చారు అంటే జ్వరం, కడుపు నొప్పి లేదా ఏదైనా ఫ్రైతో కాంబినేషన్‌గా తీసుకునే అద్భుతమైన వంటకం. ఈ మిరియాల చారు ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.
కావలసిన పదార్థాలు:
- 1 టేబుల్ స్పూన్ మిరియాలు
- 1 టేబుల్ స్పూన్ జీలకర్ర
- 10-15 వెల్లుల్లి రెబ్బలు
- 1 టీ స్పూన్ ఆవాలు
- 1 పెద్ద టమాటా (ముక్కలుగా తరిగినది)
- 1/2 టీ స్పూన్ పసుపు
- కొద్దిగా కరివేపాకు
- 1 పిడికెడు కొత్తిమీర
- చిటికెడు ఇంగువ
తయారీ విధానం:
1. మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లిని రోట్లో కచ్చాపచ్చాగా దంచుకోవాలి. రోట్లో దంచితే మిక్సీ కంటే సుగంధంగా, రుచిగా ఉంటుంది.
2. ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ పసుపు, 3 ఎండుమిర్చి, టమాటా ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించాలి.
3. టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత, 1/2 లీటర్ చింతపండు నీళ్లు పోసి బాగా కలపాలి.
4. దంచిన మిరియాల-జీలకర్ర-వెల్లుల్లి పొడిని వేసి మెత్తగా కలుపుకోవాలి.
5. అందులో కొద్దిగా కరివేపాకు, 1 పిడికెడు కొత్తిమీర, చిటికెడు ఇంగువ వేసి, మీడియం మంట మీద ఒక పొంగు వచ్చే వరకు ఉడికించాలి.
6. అంతే! 5 నిమిషాల్లో వేడి వేడి మిరియాల చారు.. ఈ చారు రుచికరంగా, సుగంధంగా ఉండి అందరినీ ఆకర్షిస్తుంది.